Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో డాబర్ గ్రూప్ ఛైర్మన్, డైరెక్టర్లు..!

Mahadev Betting App: దేశంలో బెట్టింగ్ యాప్స్ అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలో యువత కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో ఇరుక్కుంటున్న అనేక కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

అయితే ప్రస్తుతం మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు ఎఫ్ఐఆర్ కాపీలో డాబర్ గ్రూప్ చైర్మన్ మోహిత్ ముర్మన్, డైరెక్టర్ గౌరవ్ ముర్మన్ పేర్లను ముంబై పోలీసులు చేర్చారు. నిందితుల జాబితాలో వీరి పేర్లు ఉన్నట్లు ఇండియా టుడే సంస్థ నివేదించింది. మాతుంగా నివాసి సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ ఫిర్యాదు మేరకు నవంబర్ 7న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసు మహాదేవ్ యాప్ అనుబంధ యూనిట్ అయిన ఖిలాడీ యాప్ చుట్టూ తిరుగుతోంది.

Dabur Group Chairman Mohit Burman, Director Gaurav Burman names in Mahadev Betting App FIR

యాప్‌ను సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్.. అనేక ఇతర సహచరులు మరియు భాగస్వాములతో పాటు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసును ఈడీ విచారిస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు ఇప్పటివరకు సుమారు రూ. 508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బఘెల్‌పై బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. స్కామ్ అసలు సూత్రదారి భూపేష్ బఘేల్‌ అని ఆరోపించింది. గాంధీ కుటుంబం ఖజానా నింపేందుకు సీఎం రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఘాటు విమర్శలు బీజేపీ జేసింది.

ఈడీ అభ్యర్థన మేరకు నవంబర్ 5న కేంద్రం మహాదేవ్ యాప్, రెడ్యాన్న ప్రెస్టోప్రో సహా 22 అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ విచారణలో మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ UAEలోని సెంట్రల్ హెడ్ ఆఫీస్ నుంచి పనిచేస్తున్నట్లు వెల్లడైంది. బ్రాంచ్‌లను వారి తెలిసిన అసోసియేట్‌లకు 70-30 శాతం లాభ నిష్పత్తిలో ఫ్రాంఛైజ్ చేయడం ద్వారా పనిచేస్తున్నట్లు పేర్కొంది. అలాగే బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్‌-షోర్ ఖాతాలకు మళ్లించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+