For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్!

|

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్ రానుందా? అంటే మరోసారి ఉద్యోగులకు డీఏ పెంపుకు అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులకు ఈ శుభవార్త అందించవచ్చు. ఈసారి డియర్‌నెస్ అలవెన్స్ (DA) మూడు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. పద్దెనిమిది నెలలుగా డీఏ ఎర్రీర్స్ కోసం వేచిచూస్తున్న ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అలవెన్స్ రేట్‌ను 17 శాతం నుండి 28 శాతానికి పెంచింది. అక్టోబర్ నెలలో దీనిని మరో మూడు శాతం పెంచింది. ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు ఉద్యోగులకు డీఏను 3 శాతం పెంచి, కొత్త సంవత్సరంలో శుభవార్త అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

DA hike: Salary of Central government employees to increase?

సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు కేంద్రం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతుంది. ప్రభుత్వరంగ ఉద్యోగుల స్థూల వేతనంలో అధిక భాగాన్ని డీఏ భర్తీ చేస్తుంది. ప్రధానంగా ద్రవ్యోల్భణం ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఇస్తారు. ప్రస్తుతం కేంద్రం ఉద్యోగులకు 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తోంది.

Read more about: employees salary
English summary

DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్‌న్యూస్! | DA hike: Salary of Central government employees to increase?

In a piece of good news for Central government employees just before the new year ushers in, the Centre is likely to increase the dearness allowance (DA) by 3 per cent under the 7th Pay Commission.
Story first published: Friday, December 17, 2021, 11:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X