For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ

|

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్. వచ్చే జూలై ఒకటో తేదీ నుండి వారికి డీఏ చెల్లింపులు అమలులోకి రానున్నాయి. 3 వాయిదాల డీఏను జూలై ఒకటో తేదీ నుండి చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. గత నెలలో రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం చెప్పారు.

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు, సవరించిన రేట్ల ప్రకారం చెల్లిస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో 2020 జనవరి ఒకటో తేదీ, జూలై ఒకటో తేదీ, 2021 జనవరి ఒకటో తేదీన చెల్లించాల్సిన డీఏను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 17 శాతం డీఏ పొందుతున్నారు. ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సుల ప్రకారం వారి డీఏ పెరగనుంది.

DA, DR calculation for central government employees, pensioners

2020 జనవరి ఒకటవ తేదీ నుండి మూడు శాతం పెంపుతో 28 శాతం, జూలై ఒకటో తేదీ నుండి నాలుగు శాతం, 2021 జనవరి ఒకటో తేదీ నుండి నాలుగు శాతంతో కలిపి వారి వేతనంలో అందుకోనున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి తీసుకు వెళ్లే వేతనం భారీగా పెరగనుంది.

English summary

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ | DA, DR calculation for central government employees, pensioners

7th Pay Commission central government employees DA, DR calculation: The Narendra Modi government had announced that central government employees (CGEs) and pensioners will be getting full benefits of Dearness Allowance (DA) and Dearness Relief (DR), effective July 1.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X