రిటైల్ చైన్ డీ-మార్ట్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్, జూన్ 30, 2022తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఆదాయం దాదాపు రెండు రెట్లు పెరిగి రూ.9,806.89 కోట్లకు చేరుకుంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా ఏడాది క్రితం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,031.75 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ఈ విషయాన్ని అవెన్యూ సూపర్‌మార్ట్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బీఎస్‌ఈకి తెలియజేసింది.
జూన్ 30, 2022 నాటికి మొత్తం స్టోర్‌ల సంఖ్య 294. FY 2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, అవెన్యూ సూపర్‌మార్ట్‌ల స్టాండ్‌లోన్ ఆదాయం రూ. 3,833.23 కోట్లుగా ఉంది. ఇది FY 2019-20 ప్రీ-పాండమిక్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 5,780.53 కోట్లు.

రాధాకిషన్ దమానీ, అతని కుటుంబం నిర్వహిస్తున్న DMart మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ధర రూ. 3,395గా ఉంది.


Click it and Unblock the Notifications