డి-మార్ట్ పేరు వినని వారు ఉండరు. భారత్‌లో రిటైల్ రంగంలో ఈ సూపర్‌మార్కెట్ గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా మనం షాపింగ్‌కి వెళ్లే ప్రదేశం అని మాత్రమే అనుకుంటాం. కానీ నిజానికి డి-మార్ట్ అనేది కేవలం కస్టమర్ల కోసమే కాదు, వ్యాపారం చేయాలనుకునే చిన్న వ్యాపారులు, ప్రాపర్టీ యజమానులకు కూడా డబ్బు సంపాదించే అద్భుతమైన వేదిక.

ఇతర సూపర్‌మార్కెట్లతో పోల్చితే డి-మార్ట్ బిజినెస్ మోడల్ పూర్తిగా వేరు. వీళ్లు ఎప్పుడూ కస్టమర్ల అవసరాలను బాగా అర్థం చేసుకుంటారు. ఒక వస్తువుకు డిమాండ్ ఉంటే, దాన్ని తక్కువ ధరలో తీసుకురావడమే వీరి ఫోకస్. ఆ ఒక్క ప్రోడక్ట్ కోసం చాలామంది సప్లయర్లను సంప్రదిస్తారు. ఎవరు తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇస్తారో వారివద్ద నుంచే కొనుగోలు చేస్తారు.
ఇలా తక్కువ ధరలో వస్తువులు తెచ్చుకోవడం వలన, డి-మార్ట్ కస్టమర్లకు కూడా అదే ధరలో ఆఫర్ చేస్తుంది. అందువల్ల ప్రజలు ఎల్లప్పుడూ చవక ధరలు కోసం డి-మార్ట్‌కి వెళ్తారు. ఫలితంగా స్టోర్‌లో పెద్ద స్థాయిలో కస్టమర్ల రద్దీ ఉంటుంది. ఇది డి-మార్ట్‌కే కాదు, సరఫరాదారులకూ లాభం. ఎందుకంటే తక్కువ లాభంతో ఎక్కువ సేల్స్ అమ్ముడు పోవడం వలన మంచి ఆదాయం పొందుతారు.
ఇప్పుడు చాలా మంది చిన్న స్థాయిలో హోమ్‌మేడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఉదాహరణకు, ఇంట్లో చేసిన స్వీట్స్, పచ్చళ్లు, పాపడ్లు, హోమ్ డెకర్ వస్తువులు లేదా టెక్స్టైల్ ఐటమ్స్. ఇలాంటి నాణ్యమైన ఉత్పత్తులు ఉంటే, వాటిని డి-మార్ట్‌కి సప్లై చేసే అవకాశం ఉంది.
డి-మార్ట్‌లో సప్లయర్‌గా మారడం పెద్ద కష్టమైన పని కాదు కానీ కొంత ప్రాసెస్ ఉంటుంది. ముందుగా మీ ప్రోడక్ట్ నాణ్యమైనదిగా, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌తో సిద్ధంగా ఉండాలి. లేబుల్‌పై పేరు, తయారీ వివరాలు, MRP, తయారీ మరియు గడువు తేదీలు ఉండాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ GST రిజిస్ట్రేషన్, ఫుడ్ ప్రోడక్ట్స్‌కు FSSAI లైసెన్స్, PAN కార్డ్, బ్యాంక్ వివరాలు, ఫిర్మ్ రిజిస్ట్రేషన్ వంటివి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత డి-మార్ట్ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్ళి అక్కడ "Vendor Registration" లేదా "Become a Supplier" ఆప్షన్‌లోకి వెళ్లి ఫారమ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ వెళ్లిన తర్వాత డి-మార్ట్ మీ ప్రోడక్ట్ క్వాలిటీని చెక్ చేసి అవసరమైతే ట్రయల్ ఆర్డర్ ఇస్తుంది. అన్నీ సరైనట్లయితే సప్లయర్ అప్రూవల్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు సమయానికి డెలివరీ చేయాలి, పేమెంట్స్ మాత్రం 15-30 రోజుల్లో వస్తాయి. ధరలు తక్కువగా ఉంచడం, క్వాలిటీ తగ్గనివ్వకపోవడం, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ చేయడం, టైమ్‌కి సప్లై చేయడం వంటి విషయాలు చాలా ముఖ్యం. ఈ స్టెప్స్ పాటిస్తే మీ ప్రోడక్ట్స్ డి-మార్ట్ షెల్ఫ్‌లోకి చేరి అమ్మకాలు పెరగడం ఖాయం.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక్కో ఉత్పత్తిపై లాభం తక్కువైనా, పెద్ద మొత్తంలో అమ్మడం వలన మొత్తం ఆదాయం పెరుగుతుంది. అంటే "వాల్యూమ్ సెల్స్" వల్ల మంచి డబ్బు వస్తుంది.
డి-మార్ట్ విజయవంతంగా నడవడానికి పెద్దగా ఎక్కువ కాలి ఉండే స్థలాలు అవసరం. అందుకే వీళ్లు ఎక్కువగా లీజు ప్రాపర్టీలలో స్టోర్లు ప్రారంభిస్తారు. మీ దగ్గర పెద్ద భవనం లేదా కమర్షియల్ స్పేస్ ఉంటే, దాన్ని డి-మార్ట్‌కి అద్దెకు ఇవ్వొచ్చు.
డి-మార్ట్ బ్రాండ్ విలువ వల్ల మీరు ఎక్కువ రెంట్ తీసుకోవచ్చు. ఒకసారి కాంట్రాక్ట్ సైన్ చేస్తే, సంవత్సరాల పాటు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. దీంతో ప్రాపర్టీ యజమానులు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందగలరు.
డి-మార్ట్ సరఫరాదారులు, ప్రాపర్టీ యజమానులకి నిజంగా సేఫ్ ఆప్షన్. ఎందుకంటే డి-మార్ట్ ఎప్పుడూ టైమ్‌కి పేమెంట్ చేస్తుంది. మీ ప్రోడక్ట్ ఒక్కసారి షెల్ఫ్‌లో పడితే, రోజూ వేల మంది కస్టమర్లు చూసి కొనేస్తారు. ఒకసారి రిలేషన్ స్టార్ట్ అయితే అది సంవత్సరాల పాటు కొనసాగుతుంది.
అందుకే డి-మార్ట్‌ను కేవలం కస్టమర్ల షాపింగ్ ప్లేస్‌గా మాత్రమే కాకుండా, డబ్బు సంపాదించే మంచి భాగస్వామిగా కూడా చూడాలి. ఎందుకంటే ఇది కేవలం కొనుగోలు చేసే స్థలం కాదు, చిన్న వ్యాపారులు, ప్రాపర్టీ యజమానులు, సప్లయర్లు అందరికీ స్థిరమైన ఆదాయం తీసుకువచ్చే స్థలం.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications