Radhakishan Damani: దేశంలోని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మరణించిన తర్వాత.. ఆయన పెట్టుబడులు, ట్రస్ట్ బాధ్యతలు ఎవరు చూసుకుంటారనే ప్రశ్నలు మెుదలయ్యాయి. అయితే.. బిగ్ బుల్ గురువు, నమ్మకమైన స్నేహితుడు, సలహాదారు, అనుభవజ్ఞుడైన పెట్టుబడిదారు, డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. రాధాకిషన్ దమానీ.. రాకేష్ జున్‌జున్‌వాలా ట్రస్ట్‌కు ప్రధాన ట్రస్టీగా నియమితులయ్యారు. ఈయనకు తోడు కల్ప్రజ్ ధరన్షి, అమల్ పారిఖ్ అనే మరో ఇద్దరు ట్రస్టీలు ఉన్నారు.

రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఎవరు నిర్వహిస్తారు?
రేర్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహణలో ఉత్పల్ సేథ్, అమిత్ గోయల్, దమానీ చూసుకుంటారని తెలుస్తోంది. ఇదే సమయంలో బిగ్ బుల్ భార్య రేఖా కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం వీరి పెట్టుబడులు రేర్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారానే నిర్వహించబడుతున్నాయి.

జున్‌జున్‌వాలా మరణం.. కుటుంబం..
భారతదేశపు వారెన్ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్‌జున్‌వాలా ఆగస్టు 14న తన 62 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించారు. ఈయన కుటుంబంలో భార్య రేఖ జున్‌జున్‌వాలా, కుమార్తె నిష్ఠా జున్‌జున్‌వాలా, కుమారుడు ఆర్యమన్ జున్‌జున్‌వాలా, కుమారుడు ఆర్యవీర్ జున్‌జున్‌వాలా ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబానికి దాదాపు రూ.40 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.

పోర్ట్‌ఫోలియో వివరాలు..
మీడియా నివేదికల ప్రకారం జున్‌జున్‌వాలాకు 32 కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈయనను ఫాలో అవుతుంటారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. పోర్ట్‌ఫోలియోలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ పెట్టుబడులు టైటాన్‌లో ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఫుట్‌వేర్ మేకర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్, ఆటోమేకర్ టాటా మోటార్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఐటీ సంస్థ ఆప్టెక్ లిమిటెడ్, వీడియోగేమ్ మేకర్ నజారా టెక్నాలజీస్‌లో జున్‌జున్‌వాలా 10% వాటాను కలిగి ఉన్నారు.

హర్షద్ మెహతా పతనంతో..
హర్షద్ మెహతా కుంభకోణం వెలుగులోకి రావటం బిగ్ బుల్ కు బాగా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 1992లో మెహతా స్కామ్ బట్టబయలైనప్పుడు షార్ట్ సెల్లింగ్ ద్వారా జున్‌జున్‌వాలా భారీ లాభాలను ఆర్జించారు. అలా ఆ తరువాత భారత స్టాక్ మార్కెట్లలో బిగ్ బుల్ అని పేరు సంపాదించారు. 1985లో కేవలం రూ.5 వేలతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం 37 సంవత్సరాల్లో అంటే 2022 నాటికి సుమారు రూ.46.18 వేల కోట్లకు చేరుకుంది. అలా మరణానికి కొన్ని రోజుల ముందు ఆయన ఆకాశ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు.


Click it and Unblock the Notifications