Tata Trusts: మిస్త్రీ కుటుంబానికే టాటా బాధ్యతలు.. మళ్లీ ఎందుకీ నిర్ణయం.. కంపెనీలపై..

Tata Trusts: టాటా గ్రూప్ కంపెనీలన్నింటి హోల్డింగ్ కంపెనీ టాటా ట్రస్ట్స్, టాటా సన్స్. అయితే 36 ఏళ్లకు పైగా పనిచేసిన ఎన్ శ్రీనాథ్ ఇప్పటి వరకు ట్రస్ట్ సీఈవోగా కొనసాగారు. అయితే ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయటంతో ట్రస్టుల కొత్త CEO కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ బంధువు మెహ్లీ మిస్త్రీని ట్రస్టీగా నామినేట్ చేసింది.

కొత్త బాధ్యతలు..

కొత్త బాధ్యతలు..

మెహెర్జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టరైన మెహ్లీ మిస్త్రీ, గ్రూప్‌లోని రెండు ప్రధాన ట్రస్టులైన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లకు ట్రస్టీగా చేరారు. దీనికి తోడు టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు ట్రస్టీగా కూడా మిస్త్రీ నియమితులయ్యారు. మెహ్లీ 2014 నుంచి కోల్‌కతాలో క్యాన్సర్ కేర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న టాటా మెడికల్ సెంటర్‌కు ట్రస్టీగా ఉన్నారు.

గతంలో వివాదం..

గతంలో వివాదం..

టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్‌ను తొలగించిన తర్వాత టాటా, మిస్త్రీ మధ్య జరిగిన ఘర్షణలో రతన్ టాటా మద్దతుదారుడైన మెహ్లీ కూడా చిక్కుకున్నాడు. రతన్ టాటా 1991 నుంచి 2012 డిసెంబర్ 28న పదవీ విరమణ చేసేంత వరకు ఛైర్మన్ గా కొనసాగారు.

శ్రీనాథ్‌ ప్రయాణం..

శ్రీనాథ్‌ ప్రయాణం..

ట్రస్ట్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విద్య, ఉపాధి నుంచి ఆరోగ్యం వరకు అనేక రంగాల్లో పనిచేశారు. ఆయన 1986లో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో చేరారు. టాటా ఇంటర్నెట్ సర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్‌తో సహా టాటా గ్రూప్ కంపెనీలలో నాయకత్వ స్థానాలను నిర్వహించారు. అలా 2019లో ఆర్ వెంకటరమణన్ మేనేజింగ్ ట్రస్టీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత.. గ్రూప్ అనుభవజ్ఞుడైన శ్రీనాథ్‌ని మొదటి CEOగా టాటా ట్రస్ట్ నియమించింది.

ప్రస్తుతం ట్రస్ట్ పర్యవేక్షణ..

ప్రస్తుతం ట్రస్ట్ పర్యవేక్షణ..

ప్రస్తుతం మాజీ సివిల్ సర్వెంట్ విజయ్ సింగ్, TVS మోటార్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు వైస్ ఛైర్మన్‌లుగా ఉన్నారు. దీని అనుబంధ ట్రస్ట్‌లు లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్, JRD టాటా ట్రస్ట్, జామ్‌సెట్‌జీ టాటా ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, JN టాటా ఎండోమెంట్. అదే విధంగా.. సర్ రతన్ టాటా ట్రస్ట్ అనుబంధ ట్రస్ట్‌లు టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, నవాజ్‌బాయి రతన్ టాటా ట్రస్ట్, బాయి హీరాబాయి JN టాటా నవసారి ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్, సర్వజనిక్ సేవా ట్రస్ట్ దేశంలో సేవలు అందిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+