Cyrus Mistry: యువ బిలియనీర్ల జాబితాలో సైరస్ మిస్త్రీ కుమారులు.. పూర్తి వివరాలు..
Billionaires Under 30: దేశంలో స్టార్టప్ కల్చర్ విస్తృతంగా పెరుగుతున్న వేళ యువ వ్యాపారవేత్తల సంపద పెరుగుతోంది. చాలా మంది ఈ క్రమంలో యంగ్ బిలియనీర్లుగా మారిపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కుబేరుల జాబితాలో సైరస్ మిస్త్రీ కుమారులు వచ్చి చేరారు.
మిస్త్రీ కుటుంబానికి టాటాలకు దశాబ్ధాల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. సైరస్ మిస్త్రీని ఒకానొక సమయంలో రతన్ టాటా తన స్థానంలో నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వచ్చిన విబేధాలతో మిస్త్రీని తొలగించటం జరిగింది. తర్వాత కాలంలో మిస్త్రీ ఒక కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పేరు మరోమారు వార్తలు నిలిచింది. దీనికి కారణం ఆయన కుమారులే.

వివరాల్లోకి వెళితే.. 2024 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో సైరస్ మిస్త్రీ ఇద్దరు కుమారులు జహాన్, ఫిరోజ్ పేర్లు కనిపించాయి. 30 ఏళ్లలోపు అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితాలో మిస్త్రీ యువ వారసుల పేర్లు తళుక్కుమన్నాయి. జహాన్ మిస్త్రీ(25), ఫిరోజ్ మిస్త్రీ(27).. టాటా సన్స్ మాజీ ఛైర్మన్‌గా ఉన్న వారి తండ్రి సైరస్ మిస్త్రీ మరణం తరువాత 9.8 బిలియన్ డాలర్ల సంపదకు సమానమైన షేర్లను వారసత్వంగా పొందారు. దీంతో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో ఇద్దరు కుమారులు గణనీయమైన 25% వాటాను కలిగి ఉన్నారు. వారి మేనమామ షాపూర్ మిస్త్రీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జహాన్ యేల్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఫిరోజ్ వారి బలమైన విద్యా నేపథ్యాలను ప్రతిబింబిస్తూ వార్విక్ విశ్వవిద్యాలయానికి హాజరయ్యాడు. ఫిరోజ్ కుటుంబ వ్యాపారంలో తన చురుకైన పాత్రను హైలైట్ చేస్తూ ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్న నిర్మాణ & ఇంజనీరింగ్ సంస్థ అయిన ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధుల సేకరణ ప్రయత్నాల వంటి వ్యూహాత్మక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు.


Click it and Unblock the Notifications