సైరస్ మిస్త్రీ, టాటా సన్స్ వివాహం కొత్త మలుపు తిరిగింది! మిస్త్రీ ఉద్వాసన చెల్లదని NCLAT ఇటీవల తీర్పు చెప్పింది. దీనిపై టాటా సన్స్, టీసీఎస్, రతన్ టాటా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ రోజు (జనవరి 6) సుప్రీం విచారణ చేపడుతుందని భావిస్తున్నారు. ఇంతలో మిస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్స్ బాధ్యతలు తాను చేపట్టే ప్రసక్తి లేదని చెప్పారు.
NCLT తీర్పును సవాల్ చేసి NCLATలో నెగ్గిన మిస్త్రీ తాను నైతిక విజయం సాధించినట్లు చెప్పారు. మైనార్టీ భాగస్వాముల హక్కుల కోసమే తాను ఈ న్యాయపోరాటం చేశానని చెప్పారు. తాజాగా, NCLAT తీర్పుపై సుప్రీం కోర్టుకు ఎక్కిన సమయంలో మిస్త్రీ స్పందించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, టీసీఎస్, టాటా టెలీ సర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా వెళ్లే ఉద్దేశం తనకు లేదని ఆదివారం స్పష్టం చేశారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

వ్యక్తిగత ప్రయోజనాల కంటే టాటా గ్రూప్ ప్రయోజనాలు తనకు ముఖ్యమని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రికార్డుల్లో ఉన్న అన్ని విషయాలను సమీక్షించిన తర్వాత తనను తొలగించిన పద్ధతి చట్టవిరుద్ధమైనదని NCLAT గుర్తించిందన్నారు. కాబట్టి NCLAT ఆదేశాలపై తనకు గౌరవం ఉందని చెప్పారు.
అయినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాలని తాను అనుకోవడం లేదన్నారు. అదేవిధంగా టాటా గ్రూప్ నాయకత్వం గత మూడేళ్లుగా మైనార్టీ వాటాదారుల హక్కులపై అంతగా గౌరవం చూపడం లేదన్నారు. టాటా గ్రూప్స్‌కు తనకు మధ్య న్యాయపోరాటం కేవలం మైనార్టీ వాటాదారుల హక్కులను కాపాడటం కోసమే అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications