For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cyrus Mistry: దిక్సూచిలు అస్తమించిన వేళ.. అప్పుల్లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌.. కంపెనీకి కష్టకాలం..!

|

Cyrus Mistry: ఈ ఏడాది మిస్త్రీ కుటుంబానికి అస్సలు కలిసిరాలేదు. ఎందుకంటే.. సైరస్ మిస్త్రీ తండ్రి పల్లోంజీ మిస్త్రీ ఈ ఏడాది జూన్ 2022లో మరణించారు. 93 ఏళ్ల వయసులో ముంబైలో తుది శ్వాస విడిచారు. నిన్న ముంబై సమీపంలో కారు ప్రమాదం వల్ల సైరస్ మృతితో ఆ కుటుంబం మరో తీవ్ర దిగ్భ్రాంతిని చవిచూసింది.

 తండ్రి వ్యాపారంతో ప్రారంభించి..

తండ్రి వ్యాపారంతో ప్రారంభించి..

సైరస్ మిస్త్రీ దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్త. సైరస్ గతంలో టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. సైరస్ తన వృత్తి జీవితాన్ని తన తండ్రి వ్యాపారంతో ప్రారంభించారు. అతను 1991లో తన చదువును పూర్తై తర్వాత తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. అతను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ & కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. 2006లో సైరస్ టాటా & సన్స్ గ్రూప్‌లో బోర్డు సభ్యునిగా చేరారు. టాటా గ్రూప్‌లో దాదాపు 18.5 శాతం వాటాను సైరస్ కంపెనీ కొనుగోలు చేసింది.

కంపెనీకి కష్టాలు..!

కంపెనీకి కష్టాలు..!

తాజాగా సైరస్ మరణంతో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అతి కష్టం మీద అప్పుల నుంచి బయటపడింది. కంపెనీకి బాధ్యతలు వహిస్తున్న ఇద్దరు అనువజ్ఞులు మృతి కంపెనీకి మరింత ఛాలెంజ్ గా మారనుంది. ఎందుకంటే.. ఆ వ్యాపార గ్రూప్ కు కోట్లాది రూపాయల అప్పు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వ్యాపారం ఎలా ముందుకు సాగుతుంది అనే ఉత్కంఠ పెరిగింది.

అనేక ప్రయత్నాల తర్వాత..

అనేక ప్రయత్నాల తర్వాత..

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అప్పుల నుంచి బయటపడేందుకు కొన్ని వ్యాపారాలను వదులుకోవలసి వచ్చింది. కంపెనీకి దాదాపు రూ.4,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పు చెల్లించడానికి సోలార్ పవర్ ప్లాంట్, రహదారి ఆస్తులను విక్రయించాలని నిర్ణయించారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఇటీవలే స్టెర్లింగ్ & విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాను రిలయన్స్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 2,845 కోట్లకు జరిగింది.

అప్పుల కుప్పను తగ్గించేందుకు..

అప్పుల కుప్పను తగ్గించేందుకు..

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ యురేకా ఫోర్బ్స్‌ను.. అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. 2021లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ రూ.4,200 కోట్లకు యురేకా ఫోర్బ్స్‌లో 72% వాటాను కొనుగోలు చేయడానికి ఆమోదించింది. దీనితో, గ్రూప్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యురేకా ఫోర్బ్స్ లేబుల్ క్రింద తన కన్స్యూమర్ డ్యూరబుల్స్ వ్యాపారాన్ని విక్రయించే ప్రక్రియను పూర్తి చేసింది. ఇది నవంబర్ 2019లో ప్రారంభమైంది. ఈ డీల్ అప్పుల కుప్పను తగ్గించుకోవటానికి SP గ్రూప్‌కు సహాయపడింది.

1865లో ప్రారంభమైన SP గ్రూప్‌..

1865లో ప్రారంభమైన SP గ్రూప్‌..

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ 1865లో ప్రారంభించబడింది. దీని పునాది పల్లోంజి మిస్త్రీచే వేయబడింది. ఆ సమయంలో లిటిల్‌వుడ్ పల్లోంజి & కంపెనీ ఏర్పడింది. తర్వాత సైరస్ తాత షాపూర్జీకి పల్లోంజీ పని బాధ్యతలు అప్పగించారు. షాపూర్జీ తర్వాత ఈ కంపెనీలో భాగస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసి షాపూర్జీ పల్లోంజీ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు.

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు ప్రపంచవ్యాప్తంగా 18 కంపెనీలు ఉన్నాయి. ఇంజనీర్ సెగ్మెంట్, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, నీరు, ఇంధనం, ఆర్థిక సేవలు వంటి ఆరు రంగాలలో సంస్థ పనిచేస్తుంది. గ్రూప్‌లో 70 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వ్యాపారం 50 కంటే ఎక్కువ దేశాలలో విస్తరించి ఉంది.

English summary

Cyrus Mistry: దిక్సూచిలు అస్తమించిన వేళ.. అప్పుల్లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌.. కంపెనీకి కష్టకాలం..! | cyrus mistry death is great loss to company as shapoorji pallonji group just got out of debts

cyrus mistry death is great loss to company as shapoorji pallonji group just got out of debts
Story first published: Monday, September 5, 2022, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X