Upcoming IPO's: ఈవారం మాదిరిగానే వచ్చే వారం సైతం మరిన్ని ఐపీవోలు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. రెండు ప్రధాన కంపెనీలు బోర్డు ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌తో ముందుకు వస్తున్నాయి. ఇవి ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టింగ్ కానున్నాయి.
ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ 26 జూన్ 2023న అంటే రానున్న సోమవారం ప్రారంభం కానుంది. అలాగే ఇది 29 జూన్ 2023న ముగుస్తుంది. డ్రోన్ మేకింగ్ కంపెనీ ఐపీవోకు తన షేర్ ధర ప్రైస్ బ్యాండ్ ను రూ.638-672గా నిర్ణయించింది. డ్రోన్ మేకర్ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే ₹ 255 కోట్లు సేకరించింది. గ్రే మార్కెట్లో మంచి స్పందన కారణంగా ఇది పబ్లిక్ ఇష్యూ ధర కంటే దాదాపు 75 శాతం అధిక రేటుకు లిస్ట్ అవ్వొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాట్మెంట్ లో షేర్లు పొందే రిటైల్ ఇన్వెస్టర్లు మంచి లాభాలను పొందే అవకాశం ఉందిని తెలుస్తోంది.

ఇక Cyient DLM లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ విషయానికి వస్తే మంగళవారం అంటే 27 జూన్ 2023న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడే ఐపీవో జూన్ 30, 2023న క్లోజ్ అవనుంది. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఆటో, ఏవియేషన్, ఇండస్ట్రియల్, డిఫెన్స్ వంటి రంగాలకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. 30 ఏళ్లకుపైగా వ్యాపారంలో ఉన్న కంపెనీ తన షేర్ ధర ప్రైస్ బ్యాండ్ ను రూ.250-265గా నిర్ణయించింది. గ్రేమార్కెట్లో ఇప్పటికే మంచి స్పందన ఉన్నందున లిస్టింగ్ సమయంలో దాదపు 40 శాతం అధిక ధరకు లిస్టింగ్ అవ్వొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్, Cyient DLM ఐపీవోలకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఐడియాఫోర్జ్ గ్రేమార్కెట్ ప్రీమియం రూ.500గా కొనసాగుతోంది. ఇదే సమయంలో సైయంట్ డీఎల్ఎమ్ షేర్ గ్రేమార్కెట్ ప్రీమియం రూ.110గా ఉంది.


Click it and Unblock the Notifications