ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు.. దారి మళ్లిన మరికొన్ని రైళ్లు.. దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్

Cyclone Arnab Alert: బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన 'అర్నాబ్' (Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. అక్టోబర్ 28, బుధవారం ఉదయం విశాఖపట్నం, బాపట్ల మధ్య ఏపీ-యానాం తీరాన్ని ఈ తుఫాను దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుండి 125 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో.. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు.

రద్దయిన రైలు సర్వీసులు: ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) ముందస్తు చర్యగా 60కి పైగా ప్యాసింజర్, ఇంటర్‌సిటీ, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, నరసాపూర్, రాజమండ్రి, కాకినాడ పోర్ట్, గుంటూరు జంక్షన్‌ల మీదుగా నడిచే స్వల్ప దూర రైళ్లతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి.

Cyclone Arnab Cyclone Arnab latest news Cyclone Arnab alert train cancellations flight disruptions Andhra Pradesh cyclone Visakhapatnam trains railway travel advisory cyclone landfall IMD weather alert October 27 2026 weather

విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (18515) అక్టోబర్ 29 నుండి నవంబర్ 4 వరకు, కిరండూల్-విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ (18516) కూడా నవంబర్ 4 వరకు రద్దు చేయబడ్డాయి.
విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ (58538) అక్టోబర్ 27 నుండి 30 వరకు, కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ (58537) అక్టోబర్ 28 నుండి 31 వరకు రద్దయ్యాయి.
విశాఖపట్నం-కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18512) అక్టోబర్ 30న, తిరుగు ప్రయాణ రైలు (18511) అక్టోబర్ 31న నిలిపివేశారు.
విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ (58501) మరియు కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ (58502) రైళ్లు అక్టోబర్ 27 నుండి 30 మధ్య నిర్దిష్ట తేదీలలో రద్దయ్యాయి.

మళ్లించిన, పాక్షికంగా రద్దయిన రైళ్లు:
భువనేశ్వర్ నుండి బయలుదేరే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) అక్టోబర్ 27 నుండి 30 వరకు రాయగడ వద్దనే నిలిచిపోనుంది (Short Terminated). అలాగే జగదల్‌పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) అక్టోబర్ 28 నుండి 31 మధ్య కోరాపుట్‌కు బదులుగా రాయగడ నుండి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అత్యవసర సాయం కోసం సౌత్ కోస్ట్ రైల్వే 24/7 కంట్రోల్ రూమ్‌లను, స్టేషన్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది. టికెట్ రీఫండ్లు, ఆహారం, వైద్య సహాయం అందించడానికి అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.

ఒడిశా ప్రభుత్వం అక్టోబర్ 28 కొరకు గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు తీర జిల్లాల్లో చేపల వేటను, పర్యాటక ప్రాంతాలకు ప్రవేశాన్ని నిషేధించింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని 9 ఓడరేవులలో ప్రమాద హెచ్చరిక సంకేతాలు ఎగురవేశారు. విమాన సర్వీసులపై ఇంకా అధికారిక రద్దు ప్రకటనలు రానప్పటికీ, విశాఖపట్నం, భువనేశ్వర్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ ద్వారా తమ షెడ్యూల్‌ను సరిచూసుకోవాలని సూచించారు.

అక్టోబర్ 28 నుండి 30 వరకు పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, డార్జిలింగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని IMD హెచ్చరించింది. ప్రయాణికులు ఐఎండి, రైల్వే అధికారిక అప్‌డేట్‌లను గమనిస్తూ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+