Hyderabad: సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.85 లక్షలు మోసపోయిన వైద్యుడు..!
రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. చదువురాని వారు, తక్కువగా చదువుకున్న వారు మోసపోయారంటే అర్థం ఉంది. బాగా చదువుకుని మంచి పోజిషన్ లో ఉన్నవారు కూడా సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం బిటెక్ చదువుకున్న ఓ మహిళ ఇన్ స్టాగ్రామ్ చూస్తుండగా.. యూట్యూబ్ వీడియోక లైక్ కొడితే రూ.50 ఇస్తామని ప్రకటన వచ్చింది. దీంతో ఆమె దాని క్లిక్ చేయగా.. అవతలి వ్యక్తి ఓ యూట్యూబ్ వీడియో పంపాడు. దానికి ఆమె లైక్ కొట్టింది. వెంటనే ఆమె ఫోన్ నంబర్ చెప్పగా డబ్బులు వచ్చాయి.
ఇలా రోజుకు 10 వీడియోలకు లైక్ లు కొట్టి డబ్బులు సంపాదించింది. ఈ క్రమంలోనే అవతలి వ్యక్తి మా సంస్థలో పెట్టుబడి పెడితే నెలలోనే డబుల్ అవుతుందని చెప్పాడు. మొదట్లో ఆ మహిళ నమ్మలేదు. కానీ అవతలి వ్యక్తి నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె మొదట రూ.5 వేలు పెట్టుబడి పెట్టింది. నెల రోజుల్లో ఆమెకు రూ.10 వేలు వచ్చాయి. ఆ తర్వాత రూ.25 పెట్టుబడి పెడితే రూ.50 వేలు వచ్చాయి. దీంతో ఆమె ఏకంగా రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టింది. నెల గడిచినా డబ్బులు రాలేదు. దీంతో అవతలి వ్యక్తి ఫోన్ చేస్తే స్వీచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు ఆమె గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజాగా ఓ డాక్టరే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. అతన్ని కేంద్ర మంత్రి పేరుతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడిపై ప్రకటన ఇచ్చారు. ఇది నిజమేనని నమ్మిన ఓ వైద్యుడు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయాడు. డాక్టర్ మొదటగా సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన చూసి.. దానిపై క్లిక్ చేశాడు. లింక్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ లోకి వచ్చారు. వైద్యుడితో నకిలీ డీ మ్యాట్ ఖాతా తెరిపించారు.
రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్రేడింగ్ ఛార్చీలు, సెబీ అనుమతుల కోసం ఛార్జీ, తో పాటు పన్నుల కోసం వైద్యుడి నుంచి భారీగా రాబట్టారు. బాధితుడికి నమ్మకం కలిగించడానికి, ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు కొన్ని నకిలీ స్క్రీన్ షాట్లు, మెసేజ్‌లను కూడా పంపించడంతో అది నిజమేనని అనుకుని ఇంకా పెట్టుబడి పెట్టాడు. దాదాపు రూ.85 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఖాతాలోని లాభాలను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా.. డబ్బులు రాలేదు. దీనిపై అవతలి వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా.. స్పందన రాలేదు. చివరికి మోసపోయినట్లు తెలుసుకున్న వైద్యుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా సైబర్ క్రైమ్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు.


Click it and Unblock the Notifications