బెట్టింగ్ యాప్‌ల రచ్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను తాకింది. గత కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీస్ చర్యలు చేపట్టింది. ఈ తరుణంలోనే యూట్యూబర్ల నుండి ఆర్టిస్టులకు వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటో చేస్తున్నవారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లను సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, విజయ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా ఇతరుల కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆరుగురు సినీ ప్రముఖులు, 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లపై ఈ కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 318 (4), 112 r/w 49, తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3, 3 (A) అండ్ 4 అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2008లోని 66D కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) బుక్ చేసారు.
మియాపూర్ నివాసి ఫణింద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్స్ ఇంకా ఇతర ప్లాట్‌ఫామ్స్ ని చాల మంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లను ప్రోత్సహిస్తున్నారని అతను పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం సమాజాన్ని ఇంకా యువతకు హాని కలిగిస్తున్నాయని, వీటి బారిన పడి తీవ్ర ఆర్ధిక ఒత్తిడికి గురవుతున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు. డబ్బు సంపాదించే ఆలోచనతో బెట్టింగ్ యాప్స్ కి అలవాటుపడి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని ఫిర్యాదుదారుడు చెప్పాడు.
అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్య సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారనే ఆరోపణలతో హైదరాబాద్ అండ్ సైబరాబాద్ పోలీసులు ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లపై కేసులు నమోదు చేసినప్పటికీ, మొదటిసారిగా సినీ ప్రముఖులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు.
1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టాన్ని ఉల్లంఘించి జూదం ఆడటాన్ని ప్రోత్సహించే మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్‌ల గురించి ఆందోళన వ్యక్తం చేసిన వినయ్ వంగల (40) అనే ప్రైవేట్ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఈ సోమవారం 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై కేసు బుక్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితులకు నోటీసులు జారీ చేశారు. వారిలో కొందరు ఇప్పటికే పోలీసుల ముందు హాజరయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విష్ణు ప్రియ గురువారం దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు.

తెలంగాణలో చాలా మంది యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల భారీగా నష్టపోయారన్నది వాస్తవమని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ జోన్) ఎస్ఎం విజయ్ కుమార్ అన్నారు. ఈ నష్టాలతో కలత చెందిన కొంతమంది యువకులు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. మార్చి 16న సైబరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్‌లో రూ. 13 లక్షలకు పైగా నష్టపోయానని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేసారు. గతంలో విశాఖపట్నంకు చెందిన యూట్యూబర్ 'లోకల్ బాయ్ నాని', హైదరాబాద్‌కు చెందిన బయ్యా సన్నీ యాదవ్‌లపై కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు కేసు నమోదు చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications