1980's Photos: ట్రెండవుతున్న 1980 ఫొటోల వలలో పడుతున్నారా.. సైబర్ నిపుణుల హెచ్చరిక..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 1980 ఫొటోలు దర్శనం ఇస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ స్టేటస్ లో 1980 ఫొటోలు పెట్టి అప్పటి పాటలు జత చేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు చేయడంతో ఈ ట్రెండ్ రెండు రోజుల్లోనే వైరల్ అయింది. చాలా మంది ఒకరి ఒకరు ఫోన్ చేసుకుంటూ.. స్టేటస్ చూశావా అంటూ అడుగుతున్నారు. కొంత మంది ఈ ఫొటోలు రావాలంటే ఏం చేయాలని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఏఐకి ఇవ్వడానికి ప్రామ్ట్ కావాలని అడుగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. దీని వెనక సైబర్ మోసగాళ్లు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
చాలా మంది చాట్ జీపీటీలో ఫొటోలు అప్ లోడ్ చేసి 1980 కాలం నాటి హెయిర్‌స్టైల్, దుస్తులు, ఆభరణాలు, ఫిల్మ్ కెమెరా ఎఫెక్ట్ వంటి మార్పులతో ఫొటోలను క్రియేట్ చేసుకుని వాట్సాప్ ల్లో స్టేటస్ పెట్టుకుంటున్నారు. దీన్నే అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వింటేజ్ ఫొటోలు క్రియేట్ చేస్తామంటూ.. కొందరు నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్, సోషల్ మీడియా లింకులను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వాటిని నమ్మి ఫొటోలు అప్‌లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం లేదా ఇతర సున్నితమైన వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు.

నకిలీ ఏఐ టూల్స్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి, వాటి ద్వారా ఫోన్‌లోకి మాల్వేర్ పంపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందరు 1980 ఫొటోలు పెట్టారు.. తాము కూడా అలా చేయాలని తొందరలో తెలియని వెబ్‌సైట్లు, యాప్స్ లేదా అనుమానాస్పద లింకులను ఉపయోగించవద్దని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత ఫొటోలు, గుర్తింపు పత్రాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సమాచారాన్ని తెలియని ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయకుండా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్ లు క్లిక్ చేయవద్దని కోరుతున్నారు. సరదా కోసం ఏఐలో అప్ లోడ్ చేస్తున్న ఫొటోలను ఏఐ కంపెనీలు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పెంచుకోవడానికి ఉపయోగించే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
