CXMT Listing: లిస్టింగ్ రోజే 535 శాతం రాబడి అందించిన స్టాక్..
ఓ స్టాక్ లిస్టింగ్ రోజు ఏకంగా 500 శాతానికి పైగా పెరిగింది. ఐపీఓలో షేర్లు అలాట్ అయిన వారి సంపద అమాంతం పెరిగింది. చైనాకు చెందిన దిగ్గజ మెమొరీ చిప్ తయారీ సంస్థ సీఎక్స్ఎంటీ కార్పొరేషన్ స్టాక్ మార్కెట్లో రికార్డు క్రియేట్ చేసింది. షాంఘై స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ అయిన తొలి రోజే కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 500 శాతానికిపైగా పెరిగాయి. ఆసియాలో ఈ ఏడాది అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఈ ఇష్యూ చైనా క్యాపిటల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఐపీఓలో ఒక్కో షేరును 8.66 యువాన్ ధరకు విక్రయించిన కంపెనీ షేరు నేరుగా 49.50 యువాన్ల దగ్గర లిస్టింగ్ అయింది.
ఇక్కడ ఏకంగా 471 శాతం ప్రీమియంలో లిస్ట్ అయింది. అక్కడితో ఆగకుండా ఇంట్రాడేలో మరింత పెరిగింది. ఈ క్రమంలోనే 55.03 యువాన్ల దగ్గర సెషన్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఇక్కడ ప్రీమియం రికార్డు స్థాయిలో 535 శాతంగా ఉండడంతో ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ కూడా భారీ స్థాయికి చేరింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 3.65 ట్రిలియన్ యువాన్లు దాటింది. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 50 లక్షల కోట్లకుపైనే. దీంతో ఇప్పటివరకు చైనాలో మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో ఉన్న ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాను (ICBC) వెనక్కి నెట్టి ఆ దేశంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా సీఎక్స్ఎంటీ కార్పొరేషన్ నిలిచింది.

అమెరికా విధిస్తున్న సెమీకండక్టర్ ఆంక్షల నేపథ్యంలో స్వదేశీ చిప్ తయారీని బలోపేతం చేయాలని చైనా నిర్ణయించింది. సెమీ కండక్టర్ తయారీలో సీఎక్స్ఎంటీ కార్పొరేషన్ కీలక ఉండనుంది. ముఖ్యంగా ఏఐ, డేటా సెంటర్లు, హై- పర్ఫామెన్స్ కంప్యూటింగ్‌కు అవసరమైన డీఆర్ఏఎం, హెచ్బీఎం చిప్‌ల తయారీలో ఈ కంపెనీ కీలకంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద డ్రామ్ తయారీ సంస్థగా CXMTకి గుర్తింపు ఉంది.సీఎక్స్ఎంటీ కార్పొరేషన్ ఐపీఓ ద్వారా 66.6 బిలియన్ యువాన్లు సేకరించింది. ఇది భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.90 వేల కోట్లుగా ఉండనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications