e commerce: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మోసాలపై CUTS నివేదిక.. ప్రభుత్వాలకు పలు సూచనలు
e commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆఫర్స్ పేరిట వినియోగదారులను మోసం చేస్తున్నాయని తిట్టి పోస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్నేషనల్ సంస్థ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం హాట్ టాపిక్ గా మారింది.
ఆయా ఉత్పత్తుల ధరలను పెంచి వాటిపై ఇ-కామర్స్ కంపెనీలు రాయితీలు ఇస్తున్నట్లు థింక్ ట్యాంక్ CUTS ఇంటర్నేషనల్ నివేదించింది. ఈ తరహా అనైతిక పద్ధతులను అరికట్టడానికి ఆయా ప్రభుత్వాలు, ఇతర నియంత్రణ సంస్థలు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఫ్లాష్ సేల్స్ ను పూర్తిగా నిషేధించడానికి బదులు వినియోగదారులను మోసాల నుంచి రక్షించడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. మార్కెట్ పార్టిసిపెంట్లు అందరికీ లెవెల్ ప్లేయింంగ్ ఫీల్డ్ ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ మేరకు 'స్టేటస్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా: ఎవాల్యుయేటింగ్ కన్స్యూమర్ వెల్పేర్ ఆఫ్ ఇ-కన్స్యూమర్' పేరిట భారత్ లోని వాణిజ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.
న్యాయమైన, స్థిరమైన ఇ-కామర్స్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని CUTS ఇంటర్నేషనల్ తెలిపింది. విక్రేతలు తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటం చాలా కీలకమని పేర్కొంది. పోటీపడి ధరలు తగ్గించే ముందు సెల్లర్స్ మార్జిన్లు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. డీప్ డిస్కౌంట్స్ మరియు దోపిడీ ధరల మధ్య తేడాను గుర్తించాలని కోరింది.


Click it and Unblock the Notifications