సాధారణంగా బ్రాండెడ్ వస్తువులు, బట్టలు లేదా ఏదైనా ప్రొడక్ట్స్ కాపీ చేసి ఒరిజినల్ వాటికీ అచ్చం జిరాక్స్ కాపీ చేసి అమ్ముతుంటారు. కానీ ప్రస్తుతం అలంటి వాటిలో ఇప్పుడు ఒకటి కలకలం రేపుతోంది. ఇండియాలో నోట్ల రద్దు గురించి మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు 2000ను 2016 సమయంలో చలామణి నుండి తొలగించారు. ఇందుకు ఒక ముఖ్యమైన కారణం నకిలీ నోట్లను అరికట్టడానికి, 2000 నోటు రద్దు తరువాత ప్రస్తుతం పెద్ద కరెన్సీ అయినా రూ.500 నోటుకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రూ.500 నకిలీ నోటు.
అసలు విషయం ఏటంటే రూ.500 నోటుపై "reserve" అనే పదం ఉంటుంది. అయితే అది కాస్త తేడా ఉంది. ఆ నోట్ ను చూపిస్తూ ఒకతను వీడియో తీసి సామజిక మాధ్యమాల్లో వదిలాడు. దింతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో నకిలీ నోట్ల వ్యవహారం వెలుగుచూసింది. ఫేక్ 500 నోట్లను గుర్తించడం గురించి కొందరు ఫోటోలు, వివరాలతో వీడియోలు చేసి అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రమే. నకిలీ 500 నోట్లను అరికట్టాలంటే వ్యాపారులు, ప్రజలు కూడా ఏదైనా లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, నకిలీ నోట్ల గురించి అనుమానం వస్తే స్థానిక పోలీసులు, అధికారులు తెలియజేయాలని కోరుతున్నారు.

అయితే రూ.500 నోటును ఎలా గుర్తించాలి ?
*రూ.500 నోటుపై ఉన్న గ్రీన్ కలర్ స్ట్రిప్ ను గమనించండి. దాన్ని కాస్త క్రాస్ గా చూస్తే బ్లూ కలర్ లో మెరుస్తూ కనిపిస్తే అది నిజమైన నోట్. ఒక వేళ కలర్ మారకుండా గ్రీన్ కలర్ లోనే ఉంటే అది ఫేక్ నోట్ అని గుర్తించుకోవాలి.
*రూ.500 నోటుపై కుడి వైపు ఉన్న నంబర్లు చిన్న సైజులో ఉండాలి. ఒకవేళ ఆలా కాకుండా పెద్దగా లేదా వేరే స్టయిల్ లో ఉంటే అలంటి నోటు నకిలీ అని కన్ఫర్మ్ చేసుకోవాలి.
*రూ.500 నోటు ఎడమ వైపు కింద ఉన్న బాక్సులో సరిగ్గా గమనిస్తే 500 అని రాసి ఉండాలి. అలా లేకపోతే అసలైన నోటు కాదని తెలుసుకోవాలి.
ఇండియాలో నకిలీ నోట్ల హల్చల్ కొత్తేమి కాదు, గతంలో చాల నకిలీ నోట్ల కుంభకోణం బయట పడింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 14.4 శాతం ఫేక్ నోట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్ లో తెలిపింది. దీన్ని బట్టి నకిలీ రూ.500 నోట్లు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నకిలీ కరెన్సీ వల్ల మార్కెట్లు దెబ్బతింటాయి. ఇంకా ప్రజలకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థకూ పెను ముప్పుగా మారే అవకాశం కూడా ఉంటుంది. నకిలీ నోట్లపై అవగాహన పెంచడంలో ఆర్బీఐ, బ్యాంకులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. అయినాసరే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయవచ్చు.


Click it and Unblock the Notifications