Defence Mutual Funds: డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడితో రిస్క్ ఉంటుందా..!
ప్రస్తుతం పలు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి వైరం కొనసాగుతోంది. కొద్ది నెలల నుంచి ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం హౌతీలో సౌదీపై దాడులు చేస్తున్నారు. సౌదీ వద్ద దాడులను అడ్డుకునే వ్యవస్థ సరిగాలేదు. దీంతో ఆ దేశం నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు అన్ని దేశాలు రక్షణ రంగంపై దృష్టిపెట్టాయి. అలాగే ఇండియా కూడా రక్షణ రంగం దృష్టి పెట్టి వేల కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో రక్షణ రంగానికి సంబంధించి విమానాలు, ఇతర పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం.
కాని ఇప్పుడు మన దేశంలోని డిఫెన్స్ కంపెనీలు అభివృద్ధి చెందడం.. రక్షణ పరికరాలు తయారు చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మన దేశంలోని కంపెనీ వద్ద రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేస్తోంది. దీంతో డిఫెన్స్ స్టాక్స్ భారీగా పెరిగాయి. అయితే చాలా మందికి స్టాక్స్ పై సరిగా అవగాహన ఉండదు. అలాంటి వారికి డిఫెన్స్ ఫండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం రక్షణ రంగ ఫండ్ల విషయానికొస్తే మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ ఉంది. ఇది సంవత్సర కాలంలో 20.25 శాతం రాబడి ఇచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ ఇదే కాలంలో 19.98 శాతం లాభాన్ని ఇచ్చింది. గ్రోవ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఈటీఎఫ్ కూడా సంవత్సర కాలంలో 19.25 శాతం రాబడి ఇచ్చింది.

ఈ ఫండ్ల అన్ని డిఫెన్స్ ఇండెక్స్ ట్రాక్ చేస్తాయి. ఇవి కాక మరో ఫండ్ ఉంది. అదే హెచ్ డీఎఫ్సీ డిఫెన్స్ ఫండ్. ఈ ఫండ్ 19.92 శాతం రాబడి ఇచ్చింది. మూడేళ్లలో 35 శాతం రాబడి ఇచ్చింది. అయితే థిమెటిక్ ఫండ్ లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. భౌగోళిక రాజకీయ, ప్రభుత్వ సంబంధిత రిస్కులు ఉంటాయి. డిఫెన్స్ రంగంలోని షేర్లు తరచుగా భౌగోళిక రాజకీయ రిస్కులకు లోనవుతుంటాయని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ రక్షణ బడ్జెట్లు లేదా ఖర్చులలో ఏదైనా తగ్గింపు ఈ ఫండ్లను ప్రభావితం చేయవచ్చు, అలాగే ప్రధాన రక్షణ ప్రాజెక్టులలో జాప్యం కూడా ప్రభావితం చేయవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications