Currency Notes: మనిషి జీవితంలో ప్రస్తుతం డబ్బు చాలా ప్రముఖ్యమైనదిగా మారిపోయింది. ఏ చిన్న అవసరానికైనా డబ్బులు తప్పనిసరిగా కావాల్సిందే. అందుకే డబ్బును అందరూ చాలా ప్రేమగా, భద్రంగా దాచుకుంటుంటారు. మరికొందరైతే నోట్లు నలగకుండా చూసుకుంటారు. అలాటింది ఏకంగా లక్షల రూపాయలు విలువైన నోట్లు పాడైపోవటం వింటే ఖచ్చితంగా బాధగా ఉంటుంది. అసలు డబ్బంటే ఇంత నిర్లక్ష్యమా అని కూడా కొందరికి కోపం రావచ్చు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుకుందాం..

సిబ్బంది నిర్లక్ష్యం..
డబ్బు అంత విలువైనది కాబట్టే చాలా మంది దానిని బ్యాంకుల్లో భద్రపరచుకుంటుంటారు. ఈ సంఘటన గురింటి వింటే.. బ్యాంకులు డబ్బును ఏ మేరకు భద్రపరచగలవు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అవును ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరం, పాండు నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఉంచిన కరెన్సీ చెస్ట్‌లోని రూ.42 లక్షల విలువైన కరెన్సీ నోట్లు నీటిలో కరిగి పూర్తిగా ధ్వంసమయ్యాయి.

3 నెలల క్రితం..
మూడు నెలల క్రితం బ్యాంకు ఈ నోట్లను పెట్టెలో ఉంచింది. అయితే ఆ పెట్టెలోకి నీరు చేరుకోవటంతో ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు సిబ్బంది తనిఖీ చేసే సమయంలో పెట్టెలో పైనున్న నోట్లను చూశారు కానీ కింద నోట్లను పరిశీలించలేదు. బ్యాంకు వాల్ట్‌లో ఖాళీ స్థలం లేకపోవడంతో నగదు పెరిగినప్పుడు ఆ నోట్లను బాక్సుల్లో ఉంచినట్లు సమాచారం. వర్షం కురిసినప్పుడు గోడల్లోని అధిక తేమ కారణంగా పెట్టెలోకి నీరు చేరుకుందని తెలుస్తోంది. ఇక్కడ సిబ్బంది తప్పిదం కూడా ఉంది. ఈ కారణంగా రూ.42 లక్షలు వృథా అయ్యాయి.

ఆర్బీఐ తనిఖీ..
ఈ విషయంపై సమాచారం అందుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బృందం బ్యాంక్‌ను తనిఖీ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియటంతో మరో బృందం దీనిపై నివేదిక ఇచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సీనియర్ మేనేజర్ దేవిశంకర్, మేనేజర్ ఆశారాం, చెస్ట్ ఆఫీసర్ రాకేష్ కుమార్, సీనియర్ మేనేజర్ భాస్కర్ కుమార్ భార్గవ ఉన్నారు.


Click it and Unblock the Notifications