AIకి కేర్ ఆఫ్ అడ్రసుగా మారిన హైదరాబాద్.. CtrlS 10వేల కోట్ల భారీ పెట్టుబడి..

CtrlS డేటా సెంటర్స్ లిమిటెడ్ Rs.10 వేల కోట్ల భారీ పెట్టుబడితో రాష్ట్రంలో అధునాతన AI డేటాసెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో భాగంగా ఈ రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూపై తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంట్రోల్ ఎస్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దావోస్‌లో మరిన్ని కొత్త పెట్టుబడులని కూడా అన్వేషిస్తోంది. తాజాగా యూనిలీవర్, హెచ్‌సీఎల్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే డీల్ కుదుర్చుకుంది. ఈ తరుణంలోనే హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ (CtrlS) ముందుకొచ్చింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రకటించిన AI డేటాసెంటర్ క్లస్టర్ 400 మెగా వాట్ల సామర్థ్యంతో రూపొందనుంది. దీని ద్వారా 3,600 ఉద్యోగాలను సృష్టిస్తుందని ఇంకా పరోక్షంగా కూడా మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

CtrlS unveils plans for new Datacenter Park on a 40-acre land parcel near Hyderabad at 10000 crores investment

పెరిగిన పన్ను ఆదాయాల ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని గొప్పగా మెరుగుపరుస్తుందని, ఈ పెట్టుబడి డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గ్లోబల్ ఫ్రంట్‌రన్నర్‌గా తెలంగాణను నిలబెట్టడంలో ఈ సహకారం కీలకమైన దశను సూచిస్తుంది.

స్థానిక ఐటీ సామర్థ్యాలు ఇంకా ఉద్యోగ అవకాశాలను పెంచడం ద్వారా వృద్ధిని ప్రోత్సహించడంలో డేటా సెంటర్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ భాగస్వామ్యం ప్రభావాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు నొక్కిచెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటులో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందనీ కూడా చెప్పారు.

CtrlS చెన్నైలో ఒక డేటా సెంటర్ క్యాంపస్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది, దీనికోసం దాదాపు $482.5 మిలియన్ల పెట్టుబడిని చూస్తుంది. గత సంవత్సరం చివరలో CtrlS అన్ని సైట్‌లను సౌరశక్తి ఉత్పత్తికి మార్చే ప్రణాళికలో భాగంగా 12 నుండి 15 నెలలలోపు 50MW సౌర వ్యవస్థను అమలు చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఈ వారం STT GDC హైదరాబాద్‌లో $404 మిలియన్ల డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించే ప్రణాళికలను కూడా ప్రకటించింది. JLL నుండి తాజాగా నివేదిక ప్రకారం , భారతీయ డేటా సెంటర్ పరిశ్రమ 2026 నాటికి 66 శాతం వృద్ధి చెందుతుందని, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌ను కీలక మార్కెట్‌గా గుర్తించబడుతుందని నివేదిక పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+