క్రిప్టో మార్కెట్ ఇటీవల వృద్ధిని నమోదు చేస్తోంది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ క్రితం సెషన్లో 55,000 డాలర్లను క్రాస్ చేసింది. నేడు ప్రారంభం సెషన్ నుండి క్రిప్టో కరెన్సీలు పరుగులు పెడుతున్నాయి. పోల్కాడాట్ దాదాపు 11 శాతం లాభపడింది. XPR కూడా దాదాపు అంతే మొత్తంలో ఎగిసిపడింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.29 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం సెషన్‌తో పోలిస్తే 0.69 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 96.99 బిలియన్లుగా నమోదయింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ మార్కెట్ వాటా 44.71 శాతంగా ఉంది.
ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలుగా ఊగిసలాటలో ఉంది. అయితే ఇటీవల మళ్లీ జంప్ చేస్తోంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మే నెల తర్వాత సెప్టెంబర్. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 54వేల డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో 40వేల డాలర్ల నుండి 50,వేల డాలర్ల మధ్య కదలాడింది.

నేటి ఉదయం వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
- Bitcoin BTC - $54,475.28 - 24 గంటల్లో వృద్ధి 0.85% - మార్కెట్ క్యాప్ $1,027,118,213,949
- Ethereum ETH - $3,514.17 - 24 గంటల్లో క్షీణత 1.30% - మార్కెట్ క్యాప్ $414,293,218,064
- Cardano ADA - $2.24- 24 గంటల్లో వృద్ధి 0.22% - మార్కెట్ క్యాప్ $71,742,356,323
- Binance Coin BNB - $414.10 - 24 గంటల్లో క్షీణత 1.61% - మార్కెట్ క్యాప్ $69,596,357,432
- Tether USDT - $1.00 - 24 గంటల్లో వృద్ధి 0.02% - మార్కెట్ క్యాప్ $68,419,009,403
- XRP XRP -$1.15 - 24 గంటల్లో వృద్ధి 8.32% - మార్కెట్ క్యాప్ $53,916,179,568
- Solana SOL - 154.05 - 24 గంటల్లో క్షీణత 2.55% - మార్కెట్ క్యాప్ $46,090,920,243
- Polkadot DOT - $37.00 - 24 గంటల్లో వృద్ధి 11.33% - మార్కెట్ క్యాప్ $36,512,366,017
- USD Coin USDC - $1 - - 24 గంటల్లో వృద్ధి 0.01% - మార్కెట్ క్యాప్ $32,965,673,644
- Dogecoin DOGE - $0.24 - 24 గంటల్లో వృద్ధి 0.14% - మార్కెట్ క్యాప్ $32,079,636,737
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications