న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో బాగా చర్చల్లోకి వస్తోన్న పేరు డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీ. కరెన్సీతో పోల్చుకుంటే గ్లోబల్ మార్కెట్‌లో దీని విలువ అసాధారణ స్థితిలో ఉండమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి డిమాండ్ లభిస్తోంది. కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ భారీగా పెరుగుతోంది. బిట్ కాయిన్, ఎథేరియం, కార్డానో, బైనాన్స్ కాయిన్, టెదర్, ఎక్స్‌ఆర్‌పీ, సొలానో, డొజీకాయిన్, పోల్కాడాట్, యూఎస్‌డీ కాయిన్ క్రిప్టోకరెన్సీగా గుర్తింపు పొందాయి. ఇవన్నీ డిజిటల్ కరెన్సీ పరిధికి చెందినవి.
బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగింది. మూడు నెలల తరువాత తొలిసారిగా 50 వేల యూఎస్ డాలర్ల మార్క్‌ను అది అధిగమించింది. ఆ తరువాత దాని ట్రేడింగ్ స్వల్పంగా తగ్గింది. శుక్రవారం నాడు బిట్ కాయిన్ ట్రేడింగ్ 49,755.48 డాలర్ల వద్ద ముగిసింది. అదే సమయంలో ఎథేరియం ప్రైస్ భారీగా పెరిగింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌తో పోల్చుకుంటే ఈ ఉదయం దాని వేల్యూ అయిదు శాతానికి పైగా పెరిగింది. దాదాపు అన్ని క్రిప్టోకరెన్సీల వేల్యూ గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి.

భారత కాలమానం ప్రకాం.. ఈ ఉదయం 7:08 నిమిషాలకు రికార్డయిన ధరల ప్రకారం చూసుకుంటే- ఎథేరియం కిందటి రోజు క్లోజింగ్ ట్రేడింగ్ కంటే ఇవ్వాళ్ల మెరుగుపడింది. 3,934.25 యూఎస్ డాలర్లుగా రికార్డయింది. ఇక బిట్ కాయిన్ వేల్యూ అంచనాలకు అందని విధంగా ఉంటోంది. 49,755.48 డాలర్లతో దాని ట్రేడింగ్ మొదలైంది. కార్డానో ప్రైస్ 2.94, బైనాన్స్ కాయిన్-488.34 డాలర్లుగా నమోదైంది. టెదర్ వేల్యూ కూడా దాదాపుగా కార్డానోతో సమానంగా ఉంటోంది. టెదర్ ప్రైస్-1.00 డాలర్ వద్ద ఆరంభమైంది.
ఎక్స్ఆర్‌పీ-1.00, సొలానో-147.16గా నమోదైంది. సొలానో అత్యధికంగా 10.44 శాతం మేర తన ప్రైస్ వేల్యూను మెరుగుపరచుకోగలిగింది. బిట్ కాయిన్, ఎథేరియం, బైనాన్స్ కాయిన్‌లతో కంపేర్ చేసి చూస్తే.. సొలానో.. వేల్యూ ఒక్కసారిగా 10 శాతానికి పైగా పెరిగింది. ఇక డోజీకాయిన్-0.29, పొల్కాడాట్-33.63 యూఎస్ డాలర్ల వద్ద నమోదు కాగా.. యూఎస్‌డీ కాయిన్ ప్రైస్ వేల్యూ 1.00 డాలర్ వద్ద ట్రేడింగ్ అయింది. బిట్ కాయిన్ ప్రైస్ వేల్యూ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తున కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications