బిట్ కాయిన్ ప్రాఫిట్ బుకింగ్, ఐనా 50,500 దాటిన క్రిప్టో కింగ్
క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ 50వేల డాలర్లను క్రాస్ చేసి 51,000 దిశగా పరుగులు పెడుతోంది. నేడు ప్రారంభ సెషన్‌లో బిట్ కాయిన్‌తో పాటు కార్డానో క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అయితే అంతలోనే మళ్లీ పుంజుకుంది. నిన్న కార్డానో, ఎథేరియం, డోజీకాయిన్ 10 శాతం వరకు లాభపడ్డాయి. నేడు కూడా అదే ఒరవడి కొనసాగుతోంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైం గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకుంది. చాలా రోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. గత నెలలో 40వేల డాలర్లు దాటి, ఇప్పుడు 50వేల డాలర్లకు చేరుకుంది. ఇటీవల గత కొద్ది సెషన్లుగా 46,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య ఉంటోంది.
నేడు ప్రారంభంలో మెజార్టీ క్రిప్టో కరెన్సీలలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. అయితే ఈ క్షీణత ఎక్కువసేపు నిలబడలేదు. పదింట ఆరు క్రిప్టోలు ఉదయం మంచి లాభాలు నమోదు చేశాయి. డోజీకాయిన్, బిట్ కాయిన్, కార్డానో అదరగొట్టాయి. సోలానా మాత్రం దాదాపు ఇరవై శాతం మేర లాభపడింది. క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.23 ట్రిలియన్ డాలర్ల వద్ద దాదాపు స్థిరంగా ఉంది. క్రితం సెషన్‌తో పోలిస్తే లాభపడింది. మరోవైపు క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ స్వల్పంగా పెరిగి 127.68 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
- Bitcoin BTC - $49,449.23 - 0.23 శాతం డౌన్ (అయితే సాయంత్రానికి తిరిగి 50,500 డాలర్లు క్రాస్ చేసింది.)
- Ethereum ETH - $3,804.81 - 1.36 శాతం జంప్
- Binance Coin BNB - $487.25 - 1.35 శాతం జంప్
- Tether USDT - $1.00 - 1.35 శాతం డౌన్
- Cardano ADA - $3.04 - 0.01 శాతం డౌన్
- Dogecoin - 0.30 - 9.62 శాతం జంప్
- XRP - $1.28 - 2.34 శాతం జంప్
- Polkadot DOT - $32.76 - 1.51 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.01 శాతం డౌన్
- Solana SOL - 135.04 - 18.23 శాతం జంప్


Click it and Unblock the Notifications