Crypto Prices today: బిట్‌కాయిన్, సోలానా భారీ జంప్
క్రిప్టో మార్కెట్ నేడు నష్టపోయింది. గత ఇరవై నాలుగు గంటల్లో టోటల్ మార్కెట్ వ్యాల్యూమ్ 19.89 శాతం క్షీణించి 94.94 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇందులో క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 43.13 శాతంతో అన్నింటికంటే ముందు ఉండటంతో పాటు దాదాపు సగం మార్కెట్ వాటాను కలిగి ఉంది. నేడు బిట్ కాయిన్ 64,591 డాలర్ల వద్ద, ఎథేరియం 19.4 శాతం క్షీణించి 4,600 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక, సోలానా 5.50 శాతం లాభపడి, 238 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
గతవారం చివరి సెషన్‌లలో పలు క్రిప్టో కరెన్సీలు భారీగా ఎగిసిపడ్డాయి. కోకోస్వాప్ క్రిప్టో కరెన్సీ నవంబర్ పదో తేదీన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే 71 శాతం లాభపడి 0.01005 డాలర్ల నుండి 7.22 డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత సెషన్‌లలో మళ్లీ క్షీణించినప్పటికీ, ప్రస్తుతం 7.31 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ఆల్ టైమ్ హై 9.01 డాలర్లు. నేడు 7.3 డాలర్ల వద్ద ఉండటంతో ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే ఇది 20 శాతం క్షీణత.

- Bitcoin - రూ.51,60,616 - 0.97 వృద్ధి
- Ethereum - రూ.3,69,552.1 - 0.59 క్షీణత
- Tether - రూ.79.88 - 0.46 వృద్ధి
- Solana - రూ.19,040.08 - 4.71 వృద్ధి
- Cardano - రూ.152.41 - 0.34 వృద్ధి
- Dogecoin - 20.825 - 1.17 వృద్ధి
- Polkadot - 3,730 - 1.85 వృద్ధి


Click it and Unblock the Notifications