Crypto prices: 44,000 డాలర్లకు సమీపంలో బిట్ కాయిన్
క్రిప్టో మార్కెట్ ఇటీవల తీవ్ర ఊగిసలాటలో కొనసాగుతోంది. అయితే చివరి వారంతో పోలిస్తే ఇప్పటికీ లాభాల్లోనే ఉంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ రెండు సెషన్‌ల క్రితం 40,000 డాలర్ల కీలక మార్పును దాటింది. అదే ఒరవడిని కొనసాగిస్తుంది. నిన్న 44,000 డాలర్ల మార్కును దాటిన బిట్ కాయిన్, నేడు మాత్రం ఈ స్థాయి దిగువలో ట్రేడ్ అవుతోంది. ఓ సమయంలో 36,000 డాలర్ల స్థాయికి పతనమైంది. అంటే ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లతో పోలిస్తే దాదాపు సగం. కానీ రెండు సెషన్ల నుండి పైపైకి చేరుకుంటోంది. గతవారం చివరలో 40వేల డాలర్ల మార్కును దాటింది. అదే రోజు ఒక్కసారిగా 37,000 నుండి 40వేలకు చేరుకుంది. ఆ తర్వాత నుండి దూకుడు కొనసాగించింది. కానీ 43,000 డాలర్ల నుండి 44,000 డాలర్ల మధ్యనే దూకుడు ఆగింది. 2022లో బిట్ కాయిన్ 9 శాతం నష్టపోగా, ఆల్ టైమ్ గరిష్టంతో మరో 39 శాతం దూరంగా ఉంది.
ఎక్స్‌పీఆర్, స్టెల్లార్, లైట్ కాయిన్, తేజోస్, వంటివి మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బిట్ కాయిన్ 0.40 శాతం పతనమై 43,590 డాలర్లు, ఎథేరియం 1.67 శాతం తగ్గి 3077 డాలర్లు, సోలానా 7.31 శాతం తగ్గి 112 డాలర్లు, టెర్రా 4.54 శాతం తగ్గి 55.64 డాలర్లు, కార్డానో 2.67 శాతం తగ్గి 1.16 డాలర్లు, పోల్కాడాట్ 4.97 శాతం తగ్గి 21.44 డాలర్లు, డోజీకాయిన్ 4.09 శాతం తగ్గి 0.155 డాలర్లు, షిబా ఇను 4.93 శాతం తగ్గి 0.000031 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ గత 24 గంటల్లో 0.36 శాతం నష్టపోయింది. 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు, కనిష్టం 28,825 డాలర్లు. బిట్ కాయిన్ ప్రస్తుతం 43,572 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇరవై నాలుగు గంటల్లో మార్కెట్ క్యాప్ 826 బిలియన్ డాలర్లు పెరిగింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 1.68 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications