క్రిప్టో కరెన్సీ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. బిట్ కాయిన్ సహా వివిధ డిజిటల్ కాయిన్స్ భారీగా లాభపడ్డాయి. ఎథేరియం ఏకంగా దాదాపు 10 శాతం లాభపడింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 7.22 శాతం లాభపడి 39,572 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ గత నవంబర్ నెలలో 70,000 డాలర్లను సమీపించి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో ప్రస్తుతం 30,000 డాలర్లు తక్కువగా ఉంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు వంటి అంశాలు క్రిప్టో పైన ప్రభావం చూపుతున్నాయి.
ఇతర డిజిటల్ కాయిన్స్ ఎథేరియం 9.82 శాతం ఎగిసి 2,899 డాలర్ల వద్ద, ఎక్స్‌పీఆర్ 4.04 శాతం ఎగిసి 0.626981 డాలర్ల వద్ద, సోలానా 10.28 శాతం ఎగిసి 108.41 డాలర్ల వద్ద, టెర్రా 2.93 శాతం ఎగిసి 51.36 డాలర్ల వద్ద, కార్డానో 3.04 శాతం ఎగిసి 1.08 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 6.21 శాతం ఎగిసి 19.73 డాలర్ల వద్ద, స్టెల్లార్ 4.69 శాతం ఎగిసి 0.202850 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 3.68 శాతం ఎగిసి 0.14 డాలర్ల వద్ద, షిబా ఇను 3.87 శాతం ఎగిసి 0.000021 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 24 గంటల కనిష్టం 36,300 డాలర్లు కాగా, 24 గంటల గరిష్టం 39,746 డాలర్లు. ఈ సమయంలో 750 డాలర్ల మేర పెరిగింది. బిట్ కాయిన్ 52 వారాల కనిష్టం 28,825 డాలర్లు, 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు. ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం మార్కెట్ క్యాప్ గత 24 గంటల్లో 340 డాలర్ల మేర పెరిగింది. 24 గంటల గరిష్టం 2901 డాలర్లు, 24 గంటల కనిష్టం 2579 డాలర్లు.


Click it and Unblock the Notifications