క్రిప్టోకరెన్సీ నేడు(జూన్ 23 బుధవారం) క్షీణించింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.34 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. గత ఇరవై నాలుగు గంటల్లో క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 148.92 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది 9.32 శాతం. బిట్ కాయిన్ వ్యాల్యూ ప్రస్తుతం 33,871.28 డాలర్ల వద్ద ఉంది. గతవారం బిట్ కాయిన్ 40000 డాలర్లకు చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ప్రస్తుతం 30000 డాలర్ల స్థాయిలో కూడా చేరువైంది.
నేడు క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ ఇలా ఉంది... బిట్ కాయిన్ BTC ధర 33,827.82 డాలర్ల వద్ద, ఎథేరియం 1,981.54 డాలర్ల వద్ద, టెథెర్ 1.00 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ 279.77 డాలర్ల వద్ద, కార్డానో 1.22 డాలర్ల వద్ద, రిప్పిల్ 0.5847 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.1977 డాలర్ల వద్ద, USD కాయిన్ 1.00 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 15.79 డాలర్ల వద్ద, యూనిస్వాప్ 17.52 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఇదిలా ఉండగా, గతంలో క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్‌కాయిన్‌కు మద్దతు పలికిన ప్రముఖ రచయిత నజీం తాలెబ్ స్వరం మారింది. ప్రస్తుతం బిట్ కాయిన్ వ్యాల్యూ వాస్తవంగా జీరో మాత్రమే అన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేని కరెన్సీ అన్న భావనను రుజువు చేయడంలో బిట్ కాయిన్ విఫలమైందన్నారు. స్వల్పకాలంలో గానీ, దీర్ఘకాలంలో గానీ బిట్ కాయిన్‌కు విలువ లేదని చెప్పారు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా దీన్ని నిర్వహించలేమన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications