crypto prices today: క్షీణించిన బిట్ కాయిన్, ఎథేర్
బిట్ కాయిన్ స్థిరంగా ఉంది. గత నెలలో ఓ సమయంలో 30,000 డాలర్ల దిగువకు పడిపోయిన ఈ క్రిప్టో కరెన్సీ కింగ్ ఇప్పుడు 45,000 డాలర్లను దాటింది. రెండు రోజుల క్రితం 46,000 కూడా టచ్ చేసింది. అంతకుముందు బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలు నష్టపోయాయి. కానీ ఇటీవల మళ్లీ లాభపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. దీంతో క్రిప్టో కరెన్సీ కాస్త ఊగిసలాటలో ఉంది. టాప్ టెన్ క్రిప్టో కరెన్సీలో దాదాపు అన్ని కూడా స్వల్పంగా నష్టపోయాయి.
అయితే కార్డానో, టెథేర్, ఎక్స్‌పీఆర్ సోలానా వంటి క్రిప్టోలు లాభపడ్డాయి. కార్డానో దాదాపు ఆరు శాతం, సోలానా దాదాపు 7 శాతం లాభపడ్డాయి. మిగతా క్రిప్టో కరెన్సీలు నష్టపోయాయి లేదా దాదాపు స్థిరంగా ఉన్నాయి. వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ చూస్తే...

- Bitcoin ధర $44,201.61, నేడు మార్పు 2.29% క్షీణత,
- Ethereum ధర $2,977.06, నేడు మార్పు 2.54% క్షీణత,
- Cardano ధర $2.09, నేడు మార్పు 5.41% వృద్ధి,
- Binance Coin ధర $393.16, నేడు మార్పు 1.26% క్షీణత,
- Tether ధర $1, నేడు మార్పు 0.02% వృద్ధి,
- XRP ధర $1.12, నేడు మార్పు 0.26% వృద్ధి,
- Dogecoin ధర $0.2982, నేడు మార్పు 0.81% క్షీణత,
- USD Coin ధర $1, నేడు మార్పు 0.02% వృద్ధి,
- Polkadot ధర $23.85, నేడు మార్పు 0.93%, వృద్ధి.
అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ దాదాపు 1.89 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. క్రితం సెషన్‌తో పోలిస్తే దాదాపు అర శాతం క్షీణించింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ పదిహేను శాతం క్షీణించింది. బిట్ కాయిన్ వరుసగా నాలుగు వారాలుగా కాస్త పైపైకి చేరుకుంటోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications