క్రిప్టో కరెన్సీ ఈ వారం లాభాల్లో ఉంది. గతవారం వరకు కుప్పకూలిన క్రిప్టో, ఇప్పుడు సానుకూలంగా కదలాడుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు 44,000 డాలర్లకు పైనే ఉంది. గత ఏడు రోజుల్లో ఇది దాదాపు 14 శాతం లాభపడింది. అయితే 2022 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం 7.5 శాతం క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్ల నుండి ఇప్పటికీ 36 శాతం తక్కువగా ఉంది. నవంబర్ 2021లో బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 2.12 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు 3 శాతం లాభపడింది.
వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే (ఈ వార్త రాసే సమయానికి) బిట్ కాయిన్ 1.04 శాతం లాభపడి 44,149 డాలర్లు, ఎథేరియం 3.93 శాతం ఎగిసి 3,197 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 5.95 శాతం ఎగిసి 0.890, సోలానా 1.46 శాతం లాభపడి 114 డాలర్లు, టెర్రా 2.01 శాతం లాభపడి 57 డాలర్లు, కార్డానో 1.89 శాతం ఎగిసి 1.20 డాలర్లు, స్టెల్లార్ 1.01 శాతం ఎగిసి 0.242 డాలర్లు, పోల్కాడాట్ 2.41 శాతం ఎగిసి 22 డాలర్లు, డోజీకాయిన్ 2.41 శాతం ఎగిసి 0.161 డాలర్లు, షిబా ఇను 3.45 శాతం లాభపడి 0.000033 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

క్రిప్టో మార్కెట్‌లోకి వరుసగా మూడో వారం నిధులు వచ్చాయి. గతవారం 133 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇందులో కేవలం బిట్ కాయిన్‌లోకి వచ్చిన ఇన్-ఫ్లోనే 71 మిలియన్ డాలర్లు. డిసెంబర్ నుండి ఇది గరిష్టం. అలాగే వరుసగా మూడో వారం ఇన్-ఫ్లో కనిపించింది. ఈ మూడు వారాల్లో బిట్ కాయిన్‌లోకి 108 మిలియన్ డాలర్లు వచ్చాయి.


Click it and Unblock the Notifications