30,000 డాలర్ల స్థాయికి బిట్ కాయిన్, భారీగా పడిపోయిన క్రిప్టోకరెన్సీ
చైనా నిర్ణయం నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు 30వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. మంగళవారం ఉదయం బిట్ కాయిన్ 3.65 శాతం మేర క్షీణించి 32,908 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లోనే బిట్ కాయిన్ వ్యాల్యూ ఏకంగా 19 శాతం మేర క్షీణించింది. బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోవ్యాల్యూ మరింత క్షీణిస్తుందనే ఆందోళనలతో వీటి వ్యాల్యూ మరింత పడిపోతోంది. అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి.
ఎథేరియం వ్యాల్యూ 5.59 శాతం క్షీణించి 2వేల డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు ప్రారంభ సెషన్లో 1970.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం నేడు 0.10 శాతం క్షీణించింది. క్రిప్టో కరెన్సీ సేవలపై అలీపే, అతిపెద్ద బ్యాంకులు బ్యాన్ చేస్తూ నిర్ణయించడం, ఈ మేరకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా సమన్లు జారీ చేయడం ప్రభావం చూపింది.

వివిధ క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ ఇలా ఉంది...
Bitcoin: $32,816, 24 గంటల్లో 6.57 శాతం క్షీణత
Ether: $1,962, 24 గంటల్లో 10.41 శాతం క్షీణత
Tether: $1.00, 24 గంటల్లో 0.05 శాతం క్షీణత
Binance Coin: $285, 24 గంటల్లో 14.28 శాతం క్షీణత
Cardano: $1.24, 24 గంటల్లో 10.90 శాతం క్షీణత
XRP: $0.6368, 24 గంటల్లో 14.07 శాతం క్షీణత
Dogecoin: $0.2062, 24 గంటల్లో 23.34 శాతం క్షీణత
USD Coin: $1, 24 గంటల్లో 0.08 శాతం క్షీణత
Polkadot: $16.65, 24 గంటల్లో 16.82 శాతం క్షీణత
Binance USD: $1, 24 గంటల్లో 0.06 శాతం క్షీణత


Click it and Unblock the Notifications