క్రిప్టోకరెన్సీ ధరల పతనం మళ్లీ మొదలైంది. నేడు గురువారం అన్ని క్రిప్టోకరెన్సీల విలువ భారీగా పడిపోయాయి. గత నెలలో అనేక క్రిప్టోకరెన్సీల ధర కూడా గణనీయంగా పడిపోయింది. కాగా నవంబర్ 5న డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత చాలా ఊపందుకుంది. దింతో Dogecoin ధర రాకెట్‌లాగా పెరిగింది. Dogecoin కేవలం ఒక నెలలోనే 150 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. అయితే గత నెల రోజులుగా సీన్ పూర్తిగా మారిపోయింది.
ఈ రోజు గురువారం బిట్‌కాయిన్, ఎథెరియం, డాగ్‌కాయిన్‌తో సహా అనేక క్రిప్టోకరెన్సీలలో పెద్ద పతనం చోటు చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు, బిట్‌కాయిన్ ధర దాదాపు 5 శాతం పడిపోయింది. అయితే Ethereum 4 శాతం పడిపోయింది. ఇవి కాకుండా Dogecoin 6 శాతం కంటే పైగా క్షీణించింది. Dogecoin ఎలోన్ మస్క్ ఇష్టమైన క్రిప్టోకరెన్సీగా పరిగణిస్తారు.

నెల రోజుల్లో పడిపోయిన ధర ?
బిట్ కాయిన్: నవంబర్ 5న దీని ధర రూ.5746631. ఒక నెల తర్వాత, డిసెంబర్ 5న దీని ధర 52 శాతం పెరిగి రూ. 8742984కి చేరుకుంది. తరువాత ఏకంగా రికార్డు సృష్టించింది. కానీ గత నెల రోజులుగా సీన్ మారిపోయింది. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర (గురువారం సాయంత్రం 5 గంటలకు) రూ.8136919 వద్ద ఉంది. ఇంకా నవంబర్ నెలలో కేవలం 2.29 శాతం మాత్రమే పెరిగింది.
Ethereum: ఇథెరియం బిట్‌కాయిన్ తర్వాత రెండవ అత్యంత ఖరీదైన క్రిప్టోకరెన్సీ. నవంబర్ 5న దీని ధర రూ.204151. డిసెంబర్ 5న దాదాపు 60 శాతం పెరిగి రూ.326278కి చేరింది. అయితే గత నెల రోజులుగా తగ్గుముఖం పట్టింది. గురువారం సాయంత్రం 5 గంటలకు దీని ధర రూ.287516. అలాగే గత నెలలో 0.28% క్షీణత చూసింది.
Dogecoin: ట్రంప్ విజయం తర్వాత ఈ క్రిప్టోకరెన్సీ చాలా వేగంగా పరుగులు పెట్టింది. నవంబర్ 5న దీని ధర రూ.13.61. నెల రోజుల తర్వాత రూ.39.26కు చేరింది. ఇందులో ఇన్వెస్టర్లకు ఒక నెలలో 188 శాతం రాబడిని అందించింది. అయితే గత నెలలో మాత్రం అతిపెద్ద క్షీణతను చూసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు దీని ధర రూ.26.97. గత నెలలో దాదాపు 21 శాతం పడిపోయింది.
తర్వాత ఏం జరిగింది?
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా క్రిప్టోకరెన్సీలో క్షీణత కనిపిస్తోంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో క్రిప్టోకరెన్సీ మరింత పెరిగే అవకాశం ఉంది. జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీని తర్వాత ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అనుకూలంగా ఉండే కొన్ని ప్రకటనలు చేయవచ్చు. ఇదే జరిగితే క్రిప్టోకరెన్సీ ధర అమాంతం పెరగవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications