బిట్ కాయిన్, ఎథేరియం, సోలానా.. క్రిప్టో కరెన్సీలు అన్నీ పతనమే
క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ ఇటీవల క్షీణిస్తోంది. FY23 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రిప్టోపై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ కాయిన్స్ ట్రాన్సాక్షన్స్, లాభాలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రకటన తర్వాత రోజు వరకు స్వల్ప ప్రభావమే పడింది. కానీ అంతర్జాతీయంగా ప్రభావం చూడటంతో నేడు క్రిప్టో వ్యాల్యూ క్షీణించింది. దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నిన్న 38,000 డాలర్ల పైకి చేరుకుంది. 24 గంటల గరిష్టంతో ఇప్పుడు 2000 డాలర్ల వరకు పతనమైంది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 4 శాతానికి పైగా క్షీణించి 36,620 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో కనిష్టం 36,270 డాలర్లు, గత 24 గంటల్లో గరిష్టం 38,433 డాలర్లు. 693 డాలర్ల మార్కెట్ క్యాప్ పెరిగింది.

ఇతర క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే ఎథేరియం 6 శాతం క్షీణించి 26410 డాలర్ల వద్ద, ఎక్స్‌పీఆర్ 4.64 శాతంక్షీణించి 0.59 డాలర్ల వద్ద, సోలానా 11.70 శాతం క్షీణించి 96.55 డాలర్ల వద్ద, టెర్రా 6.63 శాతం క్షీణించి 49.32 డాలర్ల వద్ద, కార్డానో 3.76 శాతం క్షీణించి 1.03 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 9.90 శాతం క్షీణించి 18.38 డాలర్ల వద్ద, స్టెల్లార్ 5.68 శాతం క్షీణించి 0.192174 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 5.63 శాతం క్షీణించి 0.135 డాలర్ల వద్ద, చైన్ లింక్ 8.65 శాతం క్షీణించి 15.66 డాలర్ల వద్ద, పాలీగోన్ 8.55 శాతం క్షీణించి 1.50 డాలర్ల వద్ద, షిబా ఇను 5 శాతం క్షీణించి 0.000021 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications