క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు క్షీణించింది. కొద్ది నెలల క్రితం 65వేల డాలర్లను తాకి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన ఈ బిట్ కాయిన్ ఆ తర్వాత వివిధ అంశాల ప్రభావంతో భారీగా పతనమవుతోంది. గత కొన్ని వారాలుగా 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్యనే కదలాడుతోంది. ఈ వారం ఓ సమయంలో 30వేల డాలర్ల స్థాయికి పతనమైంది. ఆ తర్వాత కాస్త పెరిగి 31,000 దాటింది. ప్రస్తుతం 31,625 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఆల్ టైమ్ గరిష్టంతో సగానికి పైగా తక్కువగా ఉంది.
క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.55 శాతం క్షీణించి 1.31 ట్రిలియన్ డాలర్లకు పతనమైంది. బిట్ కాయిన్ వ్యాల్యూ 32వేల డాలర్లకు దిగువనే ఉంది. ఒకరోజులో 0.13 శాతం మేర క్షీణించింది. చైనాలో క్రిప్టో పైన కొరడా కొనసాగుతోంది. చైనీస్ క్రిప్టో కమ్యూనిటీ బిషిజీని రెగ్యులేటర్స్ క్లోజ్ చేశారు. డోజీకాయిన్ ఇన్వెంటర్ జాక్సన్ పాల్మర్ క్రిప్టో పైన కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో ప్రపంచంలోకి తిరిగి రాలేమన్నట్లు పేర్కొన్నారు.