Cryptocurrency news: బిట్ కాయిన్ భారీ పతనం, డోజీకాయిన్ అదేదారిలో..
క్రిప్టోకరెన్స మార్కెట్ నేడు (జూలై 11) క్షీణించింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 1.40 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 0.98 శాతం పడిపోయింది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ 33,639 డాలర్ల స్థాయికి పడిపోయింది. గతవారం పరంగా చూస్తే క్షీణించినప్పటికీ చివరి ఇరవై నాలుగు గంటల్లో 0.15 శాతం ఎగిసింది. డోజీగాయిన్ దాదాపు 4.14 శాతం క్షీణించింది. యూనిస్వాప్ 3.22 శాతం పడిపోయింది. అదే సమయంలో టెథేర్, యూఎస్‌డీ క్లబ్ మాత్రం 0.10 శాతం చొప్పున ఎగిశాయి.
నేడు బిట్ కాయిన్ BTC $33,658.22 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 0.41% క్షీణించి, వారం రోజుల్లో 2.29% పడిపోయింది.
నేడు ఎథేరియం ETH $2,118.58 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 1.44% క్షీణించి, వారం రోజుల్లో 2.51% పడిపోయింది.
నేడు టెథేర్ USDT $1.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 0.10% ఎగిసింది. వారం రోజుల్లో 0.10% పెరిగింది.

బియాన్స్ కాయిన్ BNB 317.44 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో ఏ మార్పులేదు. కానీ వారం రోజుల్లో 8.17 శాతం పెరిగింది.
కార్డానో ADA $1.34 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 0.39% క్షీణించగా, వారం రోజుల్లో 3.40% పతనమైంది.
XRP $0.6265 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 1.76% పతనం కాగా, వారం రోజుల్లో 6.14% క్షీణించింది.
డోజీకాయిన్ DOGE $0.2137 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 4.14% క్షీణించింది. వారం రోజుల్లో 12.38% పడిపోయింది.


Click it and Unblock the Notifications