Hyderabad News: క్రిప్టో స్కాంలో రూ.77 లక్షలు కోల్పోయిన బేగంపేట్ మహిళ.. ఈ ట్రాన్సాక్షన్లతో జాగ్రత్త!
Crypto Scam: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్ స్కాములు, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి స్కాములకు ఎక్కువగా హైదరాబాద్ వాసులు బలైపోతున్నారు. జీవితాంతం దాచుకున్న డబ్బులను క్షణాల్లో నేరగాళ్లు కొట్టేస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజల్లో మాత్రం ఇలాంటి విషయాలపై అవగాహన పెరగకపోవటం వారిని ఆర్థికంగా భారీ నష్టాలను చూసే పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది.
తాజాగా సైబర్ కేటుగాళ్లు మరో కొత్త విషయంలోకి వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని బేగంపేటకు చెందిన 42 ఏళ్ల గృహిణిని ఈ సారి సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఒక నెల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు దాదాపు 100 చిన్న లావాదేవీల ద్వారా సదరు మహిళ ఖాతాకు రూ.22,000 ట్రాన్స్‌ఫర్ చేరారు. చివరిగా స్కామ్ కారణంగా ఆమె కుటుంబానికి సంబంధించిన జీవితకాల సేవింగ్స్ రూ.77 లక్షలను పోగొట్టుకోవాల్సి వచ్చింది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం ముందుగా సదరు మహిళ డిసెంబర్ 2024లో టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక పార్ట్ టైమ్ ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుకుంది. ఇందులో చిన్నచిన్న టాస్కులు పూర్తి చేయటం ద్వారా డబ్బును సులువుగా పొందవచ్చని నిందితులు వెల్లడించారు. ఇదంతా నిజమేనని ఆమె నమ్మటంతో వారు చెప్పిన పనులు చేస్తూ వచ్చింది. దీనికి క్రమం తప్పకుండా వారు చిన్న మెుత్తాల్లో డబ్బును జమచేస్తూ ఆమెకు నమ్మకాన్ని కలిగించారు. ఈ తతంగా అంతా డిజిట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో నిందితులు కొనసాగించారు.
ఈ క్రమంలో నిందితులు ఆమెను కొన్ని యూట్యూబ్ టానెల్స్ లైక్ చేయటం, సబ్ స్కైబ్ చేయటం వంటి పనులు చేయించారు. ప్రతి టాస్క్ పూర్తి చేసిన వెంటనే ఆమె ఖాతాలోకి రూ.123 డిపాజిట్ చేస్తూ వచ్చారు. అలా ఆమెను వీఐపీ ప్రోగ్రామ్ అంటూ క్రిప్టో పెట్టుబడుల వైపుకు ప్రేరేపించారు. ఖచ్చితంగా లాభాలు పొందటానికి తాము సహకారం అందిస్తామని నమ్మబలికారు. అయితే డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత వర్చువల్ ఖాతాలో లాభాలను చూపిస్తూ వచ్చిన నేరగాళ్లు తీరా డబ్బులు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా యాక్సెస్ బ్లాక్ చేయబడింది. దీంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది.
అయినప్పటికీ.. మోసగాళ్లు ఆమెను మోసగించడం కొనసాగించారు. లాట్‌ఫామ్‌లోని సదరు మహిళ ఖాతాలో మరిన్ని డబ్బులు జమ చేయమని అడిగారు. ఆమె పెట్టుబడులు పెరుగుతున్నాయని నమ్మి ఒకే రోజు పలు దఫాలుగా రూ.15 లక్షలను బదిలీ చేశారు. ఇది కొనసాగటంతో ఆమెలో అనుమానం కలిగి తాను మోసపోయినట్లు గ్రహించిందని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి మోసపూరిత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాల మాటలను నమ్మి ప్రజలు తమ జీవితకాలం కష్టపడి దాచుకున్న డబ్బును పోగొట్టుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications