క్రిప్టో కరెన్సీ మళ్లీ పతనమైంది. అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ 50,000 డాలర్ల దిగువకు వచ్చింది. బిట్ కాయిన్‌తో పాటు రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం నాలుగు శాతం చొప్పిన పడిపోయాయి. డిజిటల్ కాయిన్ టెర్రా తొమ్మిది శాతం నష్టపోయింది. క్రితం సెషన్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో నేడు భారీ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో డిజిటల్ కాయిన్స్ నష్టపోయాయి. డాలర్ టర్మ్స్‌లో టాప్ 10 క్రిప్టోలలో టెర్రా అత్యంత నష్టపోయిన టోకెన్‌గా నిలిచింది. పోల్కాడాట్, సోలానా కూడా భారీగానే నష్టపోయాయి. ఇక రూపాయి టర్మ్స్‌లో దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలు కూడా దాదాపు నష్టాల్లోనే ఉన్నాయి.
షిబా ఇను, బిట్ కాయిన్, డోజీకాయిన్, పోల్కాడాట్ దాదాపు 5 శాతం మేర నష్టపోయాయి. బిట్ కాయిన్ క్రితం సెషన్‌లో 51,000 మార్కును దాటింది. కానీ ఇప్పుడు 50,000 డాలర్ల దిగువకు పడిపోయింది. దాదాపు అన్ని క్రిప్టోలు నష్టపోగా, యూఎస్‌డీ కాయిన్ మాత్రమే అతి స్వల్పంగా లాభపడింది. 2021 క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు మంచి లాభాలే వచ్చాయి. అయితే ఆల్ టైమ్ గరిష్టంతో మాత్రం తగ్గాయి. క్రిప్టో మార్కెట్ ఎక్కువగా ఊగిసలాటలో కనిపించింది.

వివిధ క్రిప్టోల ధర... నష్టం (శాతాల్లో)
బిట్ కాయిన్ - $49,168.67 - 3.66% క్షీణత
ఎథేరియం - $3,918.31 -3.82% క్షీణత
బియాన్స్ కాయిన్ - $547.06 - 0.32% క్షీణత
టెథేర్ - $1.00 - 0.04% క్షీణత
సోలానా - $188.43 - 5.77% క్షీణత
కార్డానో - $1.45 - 1.31% క్షీణత
USD కాయిన్ - $1.00 - 0.16% వృద్ధి
XRP - $0.89 - 4.12% క్షీణత
టెర్రా - $92.19 - 8.88% క్షీణత
పోల్కాడాట్ - $29.06 - 6.89% క్షీణత


Click it and Unblock the Notifications