పడిలేస్తోన్న క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ 46,000 డాలర్లకు పడిపోయి...
మేజర్ క్రిప్టో కరెన్సీ సెప్టెంబర్ 1న నష్టాల్లో ట్రేడ్ అయింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.08 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 2.02 శాతం తగ్గింది. మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూమ్ గత ఇరవై నాలుగు గంటల్లో 126.25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవల 50 వేల డాలర్ల మార్కును సమీపించిన క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ప్రస్తుతం 47 వే డాలర్ల దిగువకు చేరుకుంది. బిట్ కాయిన్ ధర ఉదయం 47,000 డాలర్ల దిగువకు చేరుకున్నప్పటికీ, సాయంత్రానికి తిరిగి 48,000 మార్కును తాకింది. బిట్ కాయిన్ ధర ఉదయం 46,862గా ఉండగా, ఆ తర్వాత పుంజుకొని 48,173డాలర్లకు చేరుకుంది. క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ డామినెన్స్ 42 శాతానికి పైగా ఉంది. క్రిప్టో కరెన్సీ సోలానా ఏడు సెషన్‌లలో ఏకంగా 56 శాతం లాభపడింది.
బిట్ కాయిన్ మే నెలలో ఆల్ టైమ్ గరిష్టం 65,000 డాలర్లను తాకింది. ఆ తర్వాత కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల కోలుకుంటోంది. చాలా రోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. పది సెషన్ల క్రితం 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. ఇటీవల గత కొద్ది సెషన్లుగా 46,000 డాలర్ల నుండి 48,000 డాలర్ల పైన ఉంటోంది. టాప్ 10లోని ఆరు క్రిప్టో కరెన్సీలు లాభపడ్డాయి. సోలానా 1 శాతం లాభపడింది.

నేటి ఉదయం వివిధ కరెన్సీ వ్యాల్యూలు
- Bitcoin BTC - $46,844.57 - 0.09 శాతం డౌన్
- Ethereum ETH - $3,426.22 - 6.64 శాతం వృద్ధి
- Binance Coin BNB - $459.66 - 0.59 శాతం వృద్ధి
- Tether USDT - $1.00 - 0.02 శాతం డౌన్
- Cardano ADA - $2.75 - 0.59 శాతం జంప్
- Dogecoin - 0.28 - 1.33 శాతం డౌన్
- XRP - $1.18 - 5.57 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.03 శాతం డౌన్
- Polkadot DOT - $30.98 - 18.41 శాతం జంప్
- Solana SOL - 110.86 - 1.67 శాతం డౌన్.


Click it and Unblock the Notifications