crypto prices today: సోలానా 5%, కార్డానో 2.2 శాతం జంప్
క్రిప్టో కరెన్సీలు ఆగస్ట్ 30 మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీలు నేడు ప్రారంభ సెషన్‌లో భారీగా లాభపడ్డాయి. బిట్ కాయిన్ మే నెలలో ఆల్ టైమ్ గరిష్టం 65,000 డాలర్లను తాకింది. ఆ తర్వాత కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల కోలుకుంటోంది. చాలా రోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. పది సెషన్ల క్రితం 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. మూడు సెషన్లుగా కాస్త తగ్గినప్పటికీ ఇప్పుడు 48,000 డాలర్ల పైన ఉంది. టాప్ 10లోని ఆరు క్రిప్టో కరెన్సీలు లాభపడ్డాయి. సోలానా ఐదు శాతం లాభపడి టాప్ 8వ క్రిప్టో కరెన్సీగా నిలిచింది.
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.06 ట్రిలియన్ డాలర్లుగా నమోది అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇది అర శాతం తక్కువ. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 24 గంటల్లో 5 శాతం తగ్గి 89.59 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఇరవై నాలుగు గంటలుగా మిశ్రమ స్పందన కనిపిస్తోందని, బిట్ కాయిన్ స్వల్పంగా పడిపోయిందని, అదే సమయంలో సోలానా అద్భుతంగా ఉందని కాయిన్ స్విట్చ్ కుబేర్ చీఫ్ బిజినెస్ ాపీసర్ షరన్ నాయర్ అన్నారు.

నేటి ఉదయం వివిధ కరెన్సీ వ్యాల్యూలు
- Bitcoin BTC - $47,938.00 - 0.34 శాతం డౌన్
- Ethereum ETH - $3,156.56 - 0.27 శాతం డౌన్
- Binance Coin BNB - $473.84 - 1.19 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.1 శాతం జంప్
- Cardano ADA - $2.80 - 2.26 శాతం జంప్
- Dogecoin - 0.28 - 0.92 శాతం జంప్
- XRP - $1.13 - 1.26 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.08 శాతం వృద్ధి
- Polkadot DOT - $25.17 - 0.80 శాతం డౌన్
- Solana SOL - $97.99 - 5.02 శాతం వృద్ధి.


Click it and Unblock the Notifications