గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ నేటి(2 జనవరి 2022) ఉదయం సెషన్‌కు 0.81 శాతం లాభపడి 2.23 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. టోటల్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ మాత్రం 25.65 శాతం క్షీణించి 66.83 బిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ మార్కెట్ వాట్ నేటి ఉదయం వరకు 0.18 శాతం క్షీణించి 39.91 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బిట్ కాయిన్ 47,000 డాలర్లకు కాస్త పైన ఉంది. ఉదయం ఈ మార్కు దిగువకు పతనమైంది. ఇతర దిగ్గజ క్రిప్టోలు కూడా క్షీణించాయి.
ఉదయం సెషన్‌లో బిట్ కాయిన్ 1.68 శాతం పెరిగి రూ.37,86,507 వద్ద ట్రేడ్ అయింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ 0.86 శాతం ఎగిసి రూ.3,00,000 వద్ద ట్రేడ్ అయింది. కార్డానో 3.1 శాతం ఎగిసి రూ.109.37 వద్ద, అవాలాంచె 4.1 శాతం ఎగిసి రూ.9,199 వద్ద, పోల్కాడాట్ 5.22 శాతం లాభపడి రూ.2,272.19 వద్ద, లైట్ కాయిన్ 1.96 శాతం ఎగిసి రూ.11,943 వద్ద ట్రేడ్ అయింది. టెథెర్ మాత్రం 0.54 శాతం క్షీణించి 79.54 వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్స్ షిబా ఇను 0.67 శాతం, డోజీకాయిన్ 0.82 శాతం, లూనా 5.21 శాతం ఎగిశాయి.

బిట్ కాయిన్ 2021 డిసెంబర్ నెలలో 16 శాతం నష్టపోయింది. ఈ క్రిప్టో 2021 మే నెలలో భారీగా నష్టపోయింది. ఆ తర్వాత అతిపెద్ద నష్టం గత నెలలోనే. అలాగే, 2013 డిసెంబర్ నుండి అత్యంత వరస్ట్ రికార్డ్ 2021 డిసెంబర్‌దే. అయితే గత ఏడాది నవంబర్ నెలలో 69,000 డాలర్ల మార్కును చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. 2021లో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన క్రిప్టోల్లో బియాన్స్ కాయిన్ ఉంది. ఇది 1300 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications