Crypto prices today: భారీగా పతనమైన బిట్ కాయిన్, ఎథేరియం
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత ఇరవై నాలుగు గంటల్లో 6.15 శాతం క్షీణించి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.49 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్ వ్యాల్యూమ్ ట్రాన్సాక్షన్ 14.82 శాతం క్షీణించింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ క్రితం సెషన్‌లో 6.68 శాతం క్షీణించి 56,788.86 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల ఇది 69,000 డాలర్లను సమీపించింది. ఆల్ టైమ్ గరిష్టంతో 12వేల డాలర్లకు పైగా నష్టపోయింది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 6.60 శాతం క్షీణించి 4,041 డాలర్ల వద్ద, సోలానా 11 శాతం పతనమై 195 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
బిట్ కాయిన్, ఎథేరియంతో పాటు షిబా ఇను, డోజీకాయిన్ వంటి పలు క్రిప్టోలు పతనమయ్యాయి. బిట్ కాయిన్, ఎథేర్, ఇతర క్రిప్టోలు వరుసగా నష్టపోతున్నాయని, బిట్ కాయిన్ మద్దతు ధర 58,000 డాలర్ల వద్ద కనిపిస్తోందని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంటున్నారు. డోజీకాయిన్ 5 శాతం క్షీణించి 0.22 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

- Bitcoin - రూ.45,33,000 - 24 గంటల్లో 6.63 క్షీణత
- Ethereum - రూ.3,23,001 - 24 గంటల్లో 7.18 క్షీణత
- Cardano - రూ.142.1 - 24 గంటల్లో 6.63 క్షీణత
- Tether - రూ.80.49 - 24 గంటల్లో 0.25 క్షీణత
- Solana - రూ.15,638 - 24 గంటల్లో 11.74 క్షీణత


Click it and Unblock the Notifications