గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌కు ఇరవై నాలుగు గంటల్లో 1.38 శాతం పెరిగింది. దీంతో క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.33 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. క్రితం ట్రేడింగ్‌లో క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 10.77 శాతం పెరిగి 74.90 బిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ పెరిగింది.
భారత కరెన్సీ రూపాయి ప్రకారం బిట్ కాయిన్ క్రితం సెషన్‌లో 0.86 శాతం లాభపడి రూ.39,78,662, ఎథేరియం 0.94 శాతం ఎగిసి రూ.3,22,000, కార్డానో 4.3 శాతం లాభపడి రూ.114.96, అవాలాంచే 0.47 శాతం ఎగిసి రూ.9093, పోల్కాడాట్ 3.69 శాతం ఎగిసి రూ.2,312, లైట్ కాయిన్ 1.82 శాతం లాభపడి రూ.12,500 వద్ద ట్రేడ్ అయింది. టెథేర్ మాత్రం 0.14 శాతం నష్టపోయి రూ.78.7 వద్ద ముగిసింది. మెమూకాయిన్స్ షిబా ఇను 2.91 శాతం, డోజీకాయిన్ 2.35 శాతం లాభపడ్డాయి.

ఇదిలా ఉండగా, స్వదేశీ జాగరణ్ మంచ్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలని కోరుతోంది. ప్రభుత్వం క్రిప్టోను తప్పనిసరిగా బ్యాన్ చేయాలని, వీటి కొనుగోలును, అమ్మకాలను లేదా ఇతర డీలింగ్స్ పైన నిషేధం విధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కోరుతోంది. ఈ మేరకు నేషనల్ కాన్‌క్లేవ్‌లో తీర్మానం పాస్ చేసింది.


Click it and Unblock the Notifications