బిట్ కాయిన్ మంగళవారం(అక్టోబర్ 26) భారీగా లాభపడింది. గతవారం బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 67,139 డాలర్లను తాకిన తర్వాత తిరిగి 60,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. అయితే మళ్లీ లాభపడుతోంది. నేడు బిట్ కాయిన్ 62,081 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ గత 24 గంటల్లో 1.70 శాతం పెరిగింది. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్‌లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 45.20శాతంగా ఉంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
బిట్ కాయిన్‌తో పాటు ఇతర కరెన్సీలు కూడా లాభపడ్డాయి. టాప్ 10 క్రిప్టో కరెన్సీల్లో టెథెర్, డోజీకాయిన్, యూఎస్‌డీ కాయిన్ మాత్రమే నష్టపోయాయి.
సోలానా, ఎక్స్‌పీఆర్ క్రిప్టోలు 3 శాతం చొప్పున లాభపడ్డాయి. డోజీకాయిన్ రెండు శాతం నష్టపోయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ రెండు శాతం లాభపడి 2.63 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది.

ప్రస్తుతం బిట్ కాయిన్ 62వేల డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.46.45 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయినప్పటికీ, ప్రస్తుతం 62వేల డాలర్లకు పైన ఉంది.
నేటి సెషన్‌లో బిట్ కాయిన్ 0.86 శాతం, ఎథేరియం 1.85 శాతం, బియాన్స్ కాయిన్ 0.63 శాతం, కార్డానో 2.08 శాతం, సోలానా 2.76 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 2.08 శాతం, పోల్కాడాట్ 1.15 శాతం లాభపడింది. డోజీకాయిన్ 2.26 శాతం, టెథేర్ 0.02 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications