మేజర్ క్రిప్టో కరెన్సీలు సోమవారం (సెప్టెంబర్ 20) భారీగా నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాల ప్రభావం క్రిప్టో మార్కెట్ పైన పడింది. క్రిప్టో కార్ట్‌లో మరో పతనం ఉండవచ్చుననే అంశాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. టాప్ 10లోని ఎనిమిది క్రిప్టో కరెన్సీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సోలానా దాదాపు 12 శాతం, కార్డానో, ఎక్స్‌పీఆర్‌లు 8 శాతం చొప్పున నష్టపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందు సెషన్‌తో పోలిస్తే 6 శాతం క్షీణించి 2.02 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ మాత్రం నాలుగు శాతం లాభపడింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ నేడు ప్రతికూలంగా కదలాడింది. సంస్థాగత పెట్టుబడిదారులు మరింత చురుగ్గా పెరుగుతున్నారని, ఈ నేపథ్యంలో మరింత అస్థిరత కూడా కనిపించవచ్చునని క్రిప్టో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రిప్టో బ్లూచిప్స్ గతవారం చివరలో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్‌ను ఎదుర్కొన్నాయని గుర్తు చేస్తున్నారు.
బిట్ కాయిన్ మార్కెట్ వాటా 40 శాతం కంటే పైగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. గతవారం తిరిగి 47వేల డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఈ వారం ప్రారంభంలో మళ్లీ 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది.

బిట్ కాయిన్ నేడు 5 శాతం కంటే ఎక్కువగా క్షీణించింది. ఎథేరియం 8 శాతం తగ్గింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 855 బిలియన్ డాలర్లకు తగ్గగా, ట్రేడింగ్ వ్యాల్యూమ్ 849 మిలియన్ డాలర్లుగా నమోదయింది. ఎథేరియం మార్కెట్ క్యాప్ 371 బిలియన్ డాలర్లకు తగ్గింది. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 815 మిలియన్ డాలర్లు. XRP, కార్డానో, పోల్కాడాట్, స్టెల్లార్, డోజీకాయిన్, చైన్ లింక్, యూనిస్వాప్, లైట్ కాయిన్ తదితర క్రిప్టోలు నష్టపోయాయి. క్రిప్టో మార్కెట్ క్యాప్ 5 శాతం మేర తగ్గింది.
నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - $44,750.33 - 6.90 శాతం డౌన్
- Ethereum ETH - $3,126.10 - 9.04 శాతం డౌన్
- Dogecoin - $0.216698 - $9.93 శాతం డౌన్
- litecoin - 163.24 - 9.63 శాతం డౌన్
- XRP - $0.957800 - $11.28 శాతం డౌన్
- Cardano ADA - $2.12 - 10.70 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.01 శాతం డౌన్
- Binance Coin BNB - $390.30 - 4.56 శాతం డౌన్
- Solana SOL - $143.11 - $12.44 శాతం డౌన్
- Polkadot DOT - $31.39 - 7.32 శాతం డౌన్
- USD Coin USDC - $1.00 - 0.01 శాతం జంప్
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications