మేజర్ క్రిప్టో కరెన్సీలు నేడు (నవంబర్ 11 గురువారం) క్షీణించాయి. టాప్ 10 క్రిప్టోల్లో తొమ్మిది నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. కార్డానో, డోజీకాయిన్, పోల్కాడాట్ వంటివి ఏకంగా 5 శాతం చొప్పున పడిపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌తో పోలిస్తే 2 శాతం పతనమై 2.82 ట్రిలియన్ డాలర్లకు క్షీణించింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 31 శాతం పెరిగి 176.91 బిలియన్ డాలర్లకు చేరుకుంది. నిన్న క్రిప్టోలు భారీగా లాభపడటంతో నేడు వీటిలో ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. బిట్ కాయిన్, ఎథేరియం కూడా స్వల్పంగా క్షీణించాయి. కేవలం కార్డానో మాత్రమే దాదాపు మూడు శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం చొప్పున లాభపడ్డాయి. మిగతా క్రిప్టోలు నష్టపోయాయి. కార్డానో 4 శాతం, డోజీకాయిన్ 3 శాతం నష్టపోయాయి. నిన్న 68,000 డాలర్లు క్రాస్ చేసిన బిట్ కాయిన్ నేడు 64,000 డాలర్ల స్థాయికి వచ్చింది. ఎథేరియం 4,674 డాలర్ల వద్ద ఉంది.
ఇటీవల పలు క్రిప్టోలు భారీగా జంప్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. కొద్ది నెలలుగా షిబా ఇను వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల స్క్విడ్ గేమ్ కూడా పరుగులు తీసింది. తాజాగా కోకోస్వాప్ క్రిప్టో భారీగా ఎగిసింది. ఇది గత ఇరవై నాలుగు గంటల్లో 76,200 రెట్లు లాభపడింది. కోకోస్వాప్ వ్యాల్యూ 0.009999 నుండి 7.63 డాలర్లకు చేరుకుంది. అయితే ఆ తర్వాత 5.85 డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ భారీగానే లాభపడినట్లు. మార్కెట్ క్యాప్ 2 బిలియన్ డాలర్లుగా ఉంది.

నేడు ఎంత తగ్గాయంటే
బిట్ కాయిన్ నేటి సెషన్‌లో 2.46 శాతం, ఎథేరియం 1.73 శాతం, బియాన్స్ కాయిన్ 1.9 శాతం, టెథేర్ 0.02 శాతం, సోలానా 3.25 శాతం, పోల్కాడాట్ 4.36 శాతం, ఎక్స్‌పీఆర్ 2.4 శాతం, డోజీకాయిన్ 4.51 శాతం నష్టపోయాయి. కార్డానో 2.74 శాతం నష్టపోయింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications