44,000 డాలర్ల పైకి చేరిన బిట్ కాయిన్, ఎథేరియం 10 శాతం జంప్
అతిపెద్ద వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్ సోమవారం లాభపడింది. నేడు బిట్ కాయిన్ 4.72 శాతం లాభపడి 44,045.69 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 828.90 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రిప్టో కరెన్సీ పైన చైనా తీవ్ర నిర్ణయం అనంతరం గతవారం క్రిప్టో మార్కెట్ పైన ప్రభావం పడింది. బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టోలు గతవారం క్షీణించాయి. అయితే నేడు మాత్రం క్రిప్టో మార్కెట్ సానుకూలంగా పుంజుకుంది. బిట్ కాయిన్ దాదాపు ఐదు శాతం లాభపడగా, రెండో క్రిప్టో దిగ్గజం ఎథేరియం 9.75 శాతం లాభపడి 3,139.8 డాలర్లుగా నమోదయింది. ఎథేరియం గతవారం రోజుల్లో 2.86 శాతం క్షీణించగా, ఈ రోజు పెరిగింది. ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ 369.14 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
టాప్ టెన్ క్రిప్టో కరెన్సీల్లో ఎథేరియం భారీగా లాభపడింది. సోలానా, ఎక్స్‌పీఆర్ నాలుగు శఆతం నుండి ఏడు శాతం లాభపడ్డాయి. యూనిస్వాప్ అయితే ఏకంగా 32 శాతం లాభపడింది. బిట్ కాయిన్ 44,000 మార్కు దాటింది. బిట్ కాయిన్ మార్కెట్ వాటా 42 శాతం కంటే పైగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమైంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. గతవారం తిరిగి 47వేల డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది.

నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - $44,045 - 4.72 శాతం జంప్
- Ethereum ETH - $3,139.8 - 9.75 శాతం జంప్
- Tether USDT - $1.00 - 0.06 శాతం జంప్
- Cardano ADA - $2.26 - 0.72 శాతం జంప్
- Binance Coin BNB - $3354.65 - 4.02 శాతం జంప్
- XRP - $0.9752 - 5.52 శాతం జంప్
- Solana SOL - $138.80 - $6.91 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.06 శాతం జంప్
- Dogecoin - $0.2071 - 1.56 శాతం జంప్
- Polkadot DOT - $29.68 - 3.14 శాతం జంప్


Click it and Unblock the Notifications