క్రిప్టో మార్కెట్: భారీగా నష్టపోయిన సోలానా, బిట్ కాయిన్, పోల్కాడాట్ 4% జంప్
క్రిప్టో కరెన్సీ మార్కెట్ సోమవారం మిశ్రమంగా ఉంది. హాలీడే బ్రేక్ అనంతరం రిస్కియర్ అసెట్స్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏ దశలో అయినా పదునైన కదలిక కోసం మార్కెట్లు ప్రపంచ సూచనల కోసం వేచి ఉంటాయి. టాప్ 10 డిజిటల్ టోకెన్స్‌లో ఆరు నేటి ఉదయం వరకు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బిట్ కాయిన్, సోలానా, టెర్రా నష్టపోగా, పోల్కాడాట్, ఎథేరియం మాత్రం నాలుగు శాతం చొప్పున ఎగిశాయి.
గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫ్లాట్‌గా 2.24 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 35 శాతం తగ్గి 89.94 బిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ గత ఏడాది ఓ సమయంలో 69,000 డాలర్లను తాకింది. అయితే ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతోంది. 2021 మే నెలలో భారీగా నష్టపోయిన బిట్ కాయిన్, ఆ తర్వాత డిసెంబర్ నెలలో 19 శాతం క్షీణించింది. గత ఏడాదిలో రెండో అతిపెద్ద నెల నష్టం డిసెంబర్‌లో కనిపించింది. అలాగే 2013 డిసెంబర్ తర్వాత ఇదే వరస్ట్. అలాగే 2015 తర్వాత మొదటిసారి 2021లో భారీ రిటర్న్స్‌తో ఆరంభించింది. ఇది అప్పుడు 36 శాతం ఎగబాకింది.

నేటి ఉదయం సెషన్‌లో ఎథేరియం, బియాన్స్ కాయిన్, కార్డానో, యూఎస్‌డీ కాయిన్, ఎక్స్‌ఆర్‌పీ, పోల్కాడాట్ లాభపడ్డాయి. ఇందులో పోల్కాడాట్ 4 శాతం కంటే ఎక్కువగా ఎగిసింది. అదే సమయంలో సోలానా 2 శాతం కంటే పైగా నష్టపోయింది. బిటా కాయిన్ దాదాపు ఒక శాతం క్షీణించింది.


Click it and Unblock the Notifications