క్రిప్టో మార్కెట్ క్షీణిస్తోంది.త కాయిన్ మార్కెట్ క్యాప్ డాట్ కామ్ డేటా ప్రకారం గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్రితం సెషన్‌తో పోలిస్తే నేడు 0.19 శాతం తగ్గి 1.87 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు 42,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గతవారం ఈ బిట్ కాయిన్ 0.11 శాతం లాభపడింది. క్రితం సెషన్‌లో భారీగా పడిపోవడంతో, ఆ ధరతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగింది. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎథేరియం 2900 డాలర్ల పైకి చేరుకుంది. ఇది కూడా నేడు 0.12 శాతం లాభపడింది. కార్డానో 2.11 డాలర్ల వద్ద, సోలానా 2 శాతం లాభపడి 138 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్ మాత్రం 0.4 శాతం మేర క్షీణించి 0.2 డాలర్లకు, పోల్కాడాట్ 0.27 శాతం పడిపోయి 27 డాలర్లకు తగ్గింది.
ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఇటీవల ఊగిసలాటలో ఉంది. అయితే బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మాత్రం మే నెల తర్వాత ఇదే కావడం గమనార్హం. బిట్ కాయిన్ మార్కెట్ వాటా 42 శాతం కంటే పైగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమైంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. గతవారం తిరిగి 47వేల డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది.

బిట్ కాయిన్ ఇలా...
బిట్ కాయిన్ 2014లో మొదటి త్రైమాసికంలో 38 శాతం మేర క్షీణించింది. రెండో త్రైమాసికంలో 33.95 శాతం లాభపడింది. మూడో త్రైమాసికంలో 40 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో 18 శాతం క్షీణించింది.
బిట్ కాయిన్ 2015లో మొదటి త్రైమాసికంలో 21 శాతం మేర క్షీణించింది. రెండో త్రైమాసికంలో 4.6 శాతం లాభపడింది. మూడో త్రైమాసికంలో 8.15 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో 82.84 శాతం లాభపడింది.
2016లో నాలుగో రెండో త్రైమాసికంలో 62 శాతం మేర క్షీణించి, నాలుగో త్రైమాసికంలో 62 శాతం కంటే పైగా లాభపడింది. 2017లో రెండో త్రైమాసికంలో 125 శాతం, మూడో త్రైమాసికంలో 80 శాతం, నాలుగో త్రైమాసికంలో 210 శాతం జంప్ చేసింది. 2018లో ప్రారంభంలో 50 శాతం, చివరలో 42 శాతం క్షీణించింది. 2019లో రెండో త్రైమాసికంలో 157 శాతం లాభపడింది. మిగతా త్రైమాసికాల్లో నష్టపోయినప్పటికీ డబుల్ డిజిట్స్‌లో ఉంది. 2020లో చివరి త్రైమాసికంలో 168 శాతం జంప్ చేసింది. 2021లో మొదటి త్రైమాసికంలో 102 శాతం జంప్ చేసి, రెండో త్రైమాసికంలో 40 శాతం క్షీణించింది. మూడో త్రైమాసికంలో 20 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications