ఈ వారం 50,000 డాలర్ల దిగువకు పడిపోయిన అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ నిన్న మరింత పతనమైంది. అయితే నేడు అతి స్వల్పంగా కోలుకున్నప్పటికీ 48,000 డాలర్లకు దిగువనే ఉంది. బిట్ కాయిన్‌తో పాటు రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా పడిపోయింది. రెండు రోజుల క్రితం సెషన్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో నిన్న భారీ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీంతో డిజిటల్ కాయిన్స్ నిన్న నష్టపోయాయి. అయితే నేడు మెజార్టీ క్రిప్టోలు లాభపడ్డాయి.
ప్రధానంగా బిట్ కాయిన్ 0.20 శాతం మేర ఎగిసింది. ఇది 47,732 వద్ద ట్రేడ్ అయింది. ఈ నెలలో ఇది దాదాపు 16 శాతం నష్టపోయింది. అయితే ఎథేరియం, సోలానా మాత్రం నష్టపోయాయి. క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 40.21 శాతంగా ఉంది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇది 0.08 శాతం అధికం. ఎథేరియం 3700 డాలర్లకు పైన ఉంది. క్రితం సెషన్ కంటే 3.24 శాతం లాభపడి 3787 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వారంలో 6 శాతం ఎగిసింది. అయితే కొన్ని క్రిప్టోలు భారీగా లాభపడ్డాయి. అదే సమయంలో భారీగా నష్టపోయిన డిజిటల్ టోకెన్స్ కూడా ఉన్నాయి.

భారీగా లాభపడిన డిజిటల్ కాయిన్స్ జియోనోమిక్స్ 1620 శాతం, మినీ గేమ్ 138 శాతం, లేడీ యూనీ 133 శాతం, రూబీ కరెన్సీ 125 శాతం, గెలాక్సీ గూగ్లీ 113 శాతం, ఐస మనీ 105 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో క్రిప్టో మాఫియా భారీగా లాభపడ్డాయి. ఆ తర్వాత నాంజ్ కాయిన్ 85 శాతం, గ్రీన్ ఐడ్ మాన్‌స్టర్ 82 శాతం, డోన్ స్వాప్ 82 శాతం, మెటా క్యాట్ 80 శాతం, ఆర్మూస్ 79 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications