నిన్నటి వరకు క్షీణించిన క్రిప్టోకరెన్సీ నేడు లాభపడింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ రెండు శాతం మేర లాభపడింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 3.69 శాతం పెరిగింది. మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్ వ్యాల్యూమ్ 24 గంటల్లో 91.84 బిలియన్ డాలర్లుగా నమోదయింది. భారత కరెన్సీలో ప్రస్తుతం బిట్ కాయిన్ ధర రూ.33.5 లక్షల వద్ద ఉంది. క్రితం సెషన్‌తో 0.09 శాతం లాభపడింది. డాలర్ మారకంలో చూస్తే బిట్ కాయిన్ 43,000 డాలర్లు (43,059.22) దాటింది. గత వారం రోజుల్లోనే బిట్ కాయిన్ 1.71 శాతం మేర క్షీణించింది. వర్చువల్ కరెన్సీ మార్కెట్ క్యాప్ 810.57 కోట్ల డాలర్లుగా ఉంది.
ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఇటీవల ఊగిసలాటలో ఉంది. అయితే బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మాత్రం మే నెల తర్వాత ఇదే కావడం గమనార్హం. బిట్ కాయిన్ మార్కెట్ వాటా 42 శాతం కంటే పైగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమైంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. గతవారం తిరిగి 47వేల డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది. నిన్న 42,000 డాలర్ల వద్ద ఉన్న బిట్ కాయిన్, ఇప్పుడు 43,000 డాలర్లు దాటింది.

బిట్ కాయిన్ 2014లో మొదటి త్రైమాసికంలో 38 శాతం మేర క్షీణించింది. రెండో త్రైమాసికంలో 33.95 శాతం లాభపడింది. మూడో త్రైమాసికంలో 40 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో 18 శాతం క్షీణించింది.
బిట్ కాయిన్ 2015లో మొదటి త్రైమాసికంలో 21 శాతం మేర క్షీణించింది. రెండో త్రైమాసికంలో 4.6 శాతం లాభపడింది. మూడో త్రైమాసికంలో 8.15 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో 82.84 శాతం లాభపడింది.
2016లో నాలుగో రెండో త్రైమాసికంలో 62 శాతం మేర క్షీణించి, నాలుగో త్రైమాసికంలో 62 శాతం కంటే పైగా లాభపడింది. 2017లో రెండో త్రైమాసికంలో 125 శాతం, మూడో త్రైమాసికంలో 80 శాతం, నాలుగో త్రైమాసికంలో 210 శాతం జంప్ చేసింది. 2018లో ప్రారంభంలో 50 శాతం, చివరలో 42 శాతం క్షీణించింది. 2019లో రెండో త్రైమాసికంలో 157 శాతం లాభపడింది. మిగతా త్రైమాసికాల్లో నష్టపోయినప్పటికీ డబుల్ డిజిట్స్‌లో ఉంది. 2020లో చివరి త్రైమాసికంలో 168 శాతం జంప్ చేసింది. 2021లో మొదటి త్రైమాసికంలో 102 శాతం జంప్ చేసి, రెండో త్రైమాసికంలో 40 శాతం క్షీణించింది. మూడో త్రైమాసికంలో 20 శాతం లాభపడింది.
రెండో క్రిప్టో దిగ్గజం ఎథేరియం నేడు 1.38 శాతం లాభపడి 2,971.96 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గతవారం రోజుల్లో ఎథేరియం 3.77 శాతం క్షీణించింది. ఎథేరియం మార్కెట్ క్యాప్ 335.21 బిలియన్ డాలర్లుగా ఉంది. బియాన్స్ కాయిన్ 0.99 శాతం లాభపడి 373.00 డాలర్ల వద్ద ఉంది.
వివిధ క్రిప్టో కరెన్సీ ధరలు
- Bitcoin - $43,059 - 1.48 శాతం జంప్.
- Ether - $2,971 - 1.38 శాతం జంప్.
- Cardano - $2.08 - 2.62 శాతం డౌన్
- Binance Coin - $373.39 - 0.57 శాతం డౌన్.
- Solana - 136.50 - 1.93 శాతం డౌన్.
- Polkadot - $27.87 - 7.68 శాతం డౌన్.
- Dogecoin - $0.2006 - 0.05 శాతం డౌన్.
ఈ 5 క్రిప్టోలు భారీగా లాభపడ్డాయి
గత ఇరవై నాలుగు గంటల్లో క్రిప్టోజూ 64,434.96 శాతం, అవెన్యూ 197.60 శాతం, బ్లాక్ చైన్ ఎక్స్చేంజ్ అలియెన్స్ 197.57 శాతం, మర్సాన్ ఎక్స్చేంజ్ టోకెన్ 181.10 శాతం, యూనిస్వాప్ ఫైనాన్స్ 158.03 లాభపడ్డాయి.
అదే సమయంలో కింది క్రిప్టోలు భారీగా నష్టపోయాయి. డోజీపెప్సీ 68 శాతం, బ్లాక్ క్లౌడ్ 62.5 శాతం, ఈ-కాయిన్ ఫైనాన్స్50 శాతం, న్యూ బీటీసీ 49 శాతం, బోరింగ్ ప్రోటోకాల్ 47.75 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications